ఉండితో విడదీయరాని అనుబంధం : కలవపూడి శివ
ABN, Publish Date - Mar 21 , 2024 | 12:21 AM
ఉండి నియోజకవర్గంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు.
కాళ్ళ/ఆకివీడు/పాల కోడేరు/ఉండి, మార్చి 20 : ఉండి నియోజకవర్గంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. బుధవారం కాళ్ల మండలం పెదఅమిరంలో ఆధినాథ్ జైన్ భగవాన్ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేశానన్నారు. ఉండి ప్రజలు 2009, 2014లో ఎనలేని ఆదరణ చూపారని గుర్తు చేశారు. 2019లో అధిష్టానం నిర్ణయం మేరకు నరసాపురం ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని, మళ్లీ ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి తెలిపినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండి ప్రజల నిర్ణయం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. మరోసారి తనను గెలిపించాలని కోరారు. ఆకివీడులో మెగా ర్యాలీలో భాగంగా ర్యాలీ నిర్వహించి వెలంపేట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిచారు. పాలకోడేరు మండలంలో శివ స్వచ్ఛంద సంస్థ కార్యాలయం నుంచి ఉండి మండలంలోని పలు గ్రామాల మీదుగా ర్యాలీ నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. ఉండి ఏఎంసీ మాజీ చైౖర్మన్ సాగి సాంబశివరాజు, భూపతిరాజు రాంబాబు, భూపతిరాజు శ్రీనివాసరాజు, పెన్మెత్స శివరామరాజు, గొట్టుముక్కల సాయివర్మ, బలరామరాజు, సతీష్‌రాజు, బుద్దరాజు పద్మావతి, చింతపల్లి వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీను, బురిడి రవిబాబు, ఇందుకూరి అప్పలరాజు, నడింపల్లి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 21 , 2024 | 12:21 AM