నాడు–నేడు పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్
ABN, Publish Date - Jan 24 , 2024 | 11:53 PM
నాడు–నేడు పనుల్లో భాగంగా అదనపు తరగతి గదులు నిర్మించిన పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర వాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు.
భీమవరం,జనవరి 24 : నాడు–నేడు పనుల్లో భాగంగా అదనపు తరగతి గదులు నిర్మించిన పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర వాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. కలెక్టరే ట్‌లో బుధవారం మన బడి–నేడు పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో మండలాల వారీగా నాడు–నేడు పనులు ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్, సర్వశిక్ష అభియాన్, పబ్లిక్ హెల్త్ వారి పరిధిలో ఉన్న పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను రానున్న 20 రోజుల్లో పూర్తి చేసి, సంబంధిత పొటోలతో సహా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలుగా ప్రతిపాదించిన పాఠశా లను నాడు–నేడు పనులతో పూర్తిచేసి సిద్ధం చేయాలన్నారు. ఇంకా నిధులు మిగిలితే పాఠశాల ప్రహరీలకు ఉపయోగించాలన్నారు. డీఈవో ఆర్.వెంకటరమణ, సమగ్ర శిక్ష పీవో పి.శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం గురువారం పురస్కరించుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
భారత గణతంత్ర వేడుకలను శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకల నిర్వహణకు సంబంధించిన అధికారులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహిం చా రు. కలెక్టరేట్ పక్కన ఉన్న పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే కార్యక్రమా నికి ఆర్డీవోను పర్యవేక్షణ అధికారిగా నియమించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభి వృద్ధి పథకాలపై స్టాల్స్ శకటాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Updated Date - Jan 24 , 2024 | 11:53 PM