ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల ప్రచారానికి అనుమతి తప్పనిసరి

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:28 AM

ఎన్నికల ప్రచారానికి సంబం ధించి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, లౌడ్‌ స్పీకర్లు, వాహనాల వినియోగంపై రాజకీయ పార్టీలు, ప్రతి నిధులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు ముందుగానే సువి ధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బుధవారం చెప్పారు.

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

భీమవరం, మార్చి 27 : ఎన్నికల ప్రచారానికి సంబం ధించి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, లౌడ్‌ స్పీకర్లు, వాహనాల వినియోగంపై రాజకీయ పార్టీలు, ప్రతి నిధులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు ముందుగానే సువి ధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బుధవారం చెప్పారు. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. గుర్తింపు పొందిన రాజకీ య పార్టీ జిల్లాస్థాయి ఆఫీస్‌ బేరర్‌ వాహనం, హెలికాప్టర్‌, హెలిప్యాడ్‌, వీడియో వ్యాన్‌, ఎయిర్‌ బెలూన్లు తదితర వాటికి అనుమతులు పొందాలని అన్నారు. పార్టీలు, అభ్య ర్థుల ఎన్నికల కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు 48 గంటల ముందుగా అధికారుల అనుమతి కోరుతూ దరఖా స్తు చేయాలని కోరారు.

ఫారం 7, 8 పరిష్కరించాలి

పెండింగ్‌లో వున్న ఫారం 7, 8లను వేగవంతంగా పరి ష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికా రులతో ఎన్నికల ప్రక్రియపై సమీక్షించారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జేసీ సీవీ ప్రవీణ్‌ ఆదిత్య, డీఆర్‌వో జె.ఉదయ భాస్కరరావు పాల్గొన్నారు. కలెక్టరు మాట్లాడుతూ జిల్లావ్యా ప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు, సి.విజిల్‌ ఫిర్యాదుల పరిష్కారంపై వివరించారు.

Updated Date - Mar 28 , 2024 | 12:28 AM

Advertising
Advertising