ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:06 AM
రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులలో 21 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాకినాడ జేసీగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య
ఏలూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులలో 21 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు ఉన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ ఆదిత్యను కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఐ.అలైఖ్యను నియమించారు. నూజివీడు సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న ఆదర్ష్ రాజేంద్రన్‌ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.
Updated Date - Jan 29 , 2024 | 12:06 AM