మంత్రాలయం గడ్డపై టీడీపీ జెండా ఎగరేస్తాం
ABN, Publish Date - Mar 17 , 2024 | 12:24 AM
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల కృషితోనే మంత్రాలయం గడ్డపై టీడీపీ జెండా ఎగురవేస్తామని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, జనసేన మంత్రాలయం ఇన్‌చార్జి, ఐక్యవాల్మీకి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ కన్వీనర్ జి.లక్ష్మన్న అన్నారు.
అందరు సమిష్టి కృషి చేస్తేనే విజయం మనదే
తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యం
మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి
మంత్రాలయం, మార్చి 16: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల కృషితోనే మంత్రాలయం గడ్డపై టీడీపీ జెండా ఎగురవేస్తామని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, జనసేన మంత్రాలయం ఇన్‌చార్జి, ఐక్యవాల్మీకి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ కన్వీనర్ జి.లక్ష్మన్న అన్నారు. శనివారం మండలంలోని మాధవరం గ్రామంలోని రాఘవేంద్రరెడ్డి నివాసంలో రఘునాథరెడ్డి, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని స్పష్టం చేశారు. మంత్రాలయంలో మూడేళ్లుగా ఎమ్మెల్యే పని చేసిన బాలనాగిరెడ్డి రోడ్లను పట్టించుకోలేదన్నారు. వాల్మీకులు ఐక్యంగా పోరాడాలని ఎస్సీ, ఎస్టీ, బీసీలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తాను గెలిచితీరుతానని, ప్రతి కుటుంబంలో ఎమ్మెల్యేగా ఉంటూ అందరికి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. బీసీలకు టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు, నారా లోకేశ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్టీఆర్, చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా కలసికట్టుగా ఉన్నామనీ, ఎవరూ ఎన్ని చెప్పినా నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌నాయకులు ఉలిగయ్య, పల్లెపాడు ముత్తురెడ్డి, రామిరెడ్డి, సురేష్ నాయుడు, నగేష్‌నాయుడు, సతీష్, సొట్టయ్య, విజయకుమార్, నరసిరెడ్డి, హనుమంతరెడ్డి, మాలపల్లి లక్ష్మయ్య, వీరేష్, బొజ్జప్ప, నరసింహులు, రామక్రిష్ణ, కౌలుట్లయ్య పాల్గొన్నారు.
Updated Date - Mar 17 , 2024 | 12:24 AM