ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం

ABN, Publish Date - Sep 21 , 2024 | 04:08 AM

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్న పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం: మంత్రి అచ్చెన్న

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి సంధ్యారాణి

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్న పాల్గొన్నారు. వైసీపీ పాలనలో అథోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వంశధార, నాగావళి, బహుదా నదుల అనుసంధానానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఇండస్ర్టియల్‌ పార్కు ఏర్పాటు చేసి, ఉపాధి కల్పిస్తామని అన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంతోపాటు సంక్షేమ పథకాల అమలుతో ప్రజల మనసును కూటమి ప్రభుత్వం గెలుచుకుందన్నారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, పలాస ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, గౌతు శిరీష, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మామిడిపల్లి గ్రామంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడిపోయిందని రాష్ర్టాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారని అన్నారు. పార్వతీపురం మండలం ములగ పంచాయతీలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

Updated Date - Sep 21 , 2024 | 04:08 AM