ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాలూరుకు మంత్రి ఏమి చేశారు?

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:20 AM

సాలూరుకు 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ప్రస్తుతం గిరిజనశాఖ మంత్రిగా ఉన్న పీడిక రాజన్నదొర సాలూరుకేమి చేశారని కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు.

సాలూరు రూరల్‌: సాలూరుకు 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ప్రస్తుతం గిరిజనశాఖ మంత్రిగా ఉన్న పీడిక రాజన్నదొర సాలూరుకేమి చేశారని కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. పట్టుచెన్నారు పంచాయతీ డి.వెలగవలస, చెన్నూరు, కొత్తూరు తదితర గ్రామాల్లో బుధవారం ఆమె ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ర్యాలీ చేశారు. మొక్కజొన్న సాగు చేసిన గిరిజన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చెన్నూరులో పలువురు గిరిజనులు ఆమెకు స్వాగతం పలికి టీడీపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. చెన్నూరుకు ప్రభుత్వపరంగా తాగునీరు సౌకర్యం లేక పోవడం దారుణమన్నారు. తాను గెలిచిన వెంటనే పనసవలస, చెన్నూరు తదితర గ్రామాలకు రోడ్లు, తాగునీరు, ఇళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, అక్యాన తిరుపతిరావు, లక్ష్మణ, సతీష్‌, కృష్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:20 AM

Advertising
Advertising