ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మరో 30 వేల టన్నుల ధాన్యం సేకరిస్తాం

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:22 AM

ప్రస్తుత ఖరీఫ్‌ సీజనులో జిల్లాలోని రైతులు ఇబ్బందులకు గురికాకుండా పండించిన ధాన్యం విక్రయించేందుకు ఏర్పాట్లు చేశామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

కలెక్టరేట్‌, జనవరి 17: ప్రస్తుత ఖరీఫ్‌ సీజనులో జిల్లాలోని రైతులు ఇబ్బందులకు గురికాకుండా పండించిన ధాన్యం విక్రయించేందుకు ఏర్పాట్లు చేశామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ధాన్యం సేక రణఫై బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో వివిధ శాఖ ల అధికారులతో సమీక్షా స మావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలో ధాన్యం సేకరణ తీరును కలెక్టర్‌, జేసీలు మంత్రికి వివరించారు. రైస్‌ మిల్లర్లు తమ సమస్యలను మంత్రికి తెలియ జేశారు. వీటిపై సమీక్షించారు. ఏదైనా మండలం నుంచి వచ్చిన ధాన్యం అక్కడి మిల్లులకు కేటాయించగా మిగిలిన తర్వాత ఇతర మండలాలకు తరలించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత సీ జనులో 3.40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి గాను ఇప్పటి వరకూ 2.67 లక్షల టన్నులు సేకరించినట్టు చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.400 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రాజాం, ఎస్‌.కోట నియోజకవ ర్గాల పరిధిలో సుమారు 50 వేల టన్నులు రావలసి ఉందని చెప్పారు. మరో 30 వేల టన్నుల సేకరణకు అను మతి ఇవ్వాల్సిందిగా ప్రభు త్వాన్ని కోరుతూ ప్రతిపాద నలు సమర్పించనున్నట్లు మంత్రి చెప్పారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు బడుగు, బలహీన ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ మయూర్‌ అశోక్‌, సివిల్‌ సప్లయిస్‌ డీ ఎం మీనాకుమారి, డీఎస్‌వో మధుసూధనరావు, జేడీ రామారావు, డీసీవో రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:22 AM

Advertising
Advertising