శిక్షణేది?
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:27 AM
స్వయం ఉపాధి కోర్సులు, శిక్షణల గురించి ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు గుప్పిస్తోంది. ఆచరణలో మాత్రం విస్మరిస్తోంది. బొబ్బిలి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో నిర్వహించే లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోర్సును పూర్తిగా నిలిపేశారు.
శిక్షణేది?
స్వయం ఉపాధి కోర్సులపై ప్రకటనలేనా?
లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు చెల్లు
నిరుద్యోగుల్లో నిరాశ
బొబ్బిలి, జనవరి 28: స్వయం ఉపాధి కోర్సులు, శిక్షణల గురించి ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు గుప్పిస్తోంది. ఆచరణలో మాత్రం విస్మరిస్తోంది. బొబ్బిలి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో నిర్వహించే లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోర్సును పూర్తిగా నిలిపేశారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఉచిత శిక్షణ అమలు చేయడం లేదు. డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వారి నుంచి సుమారు ఐదువేల రూపాయలు వసూలు చేసి శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుతం అది కూడా లేకపోవడంతో నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్నారు. మళ్లీ శిక్షణ కోర్సును ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. కాగా డ్రైవింగ్ శిక్షణ నిలిపేయడంతో నాలుగు చక్రాల వాహనం వృథాగా పడి ఉంది. ఈ వాహనం నడిపే డ్రైవరు కూడా ఎవరూ లేరు. శిక్షణ కోర్సు ప్రారంభిస్తే మళ్లీ ఎవరో ఒకరిని తీసుకోవాల్సి ఉంటుంది. కాగా బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ ప్రాంతాలు, పొరుగునున్న పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత డ్రైవింగ్ శిక్షణ కోర్సుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
డ్రైవింగ్ శిక్షణకు అనుమతి రాలేదు
బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో ఆరు నెలల డ్రోన్ టెక్నాలజీ కోర్సులో శిక్షణకు అనుమతి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎలక్ర్టీషియన్ టెక్నాలజీ కోర్సులో 90 రోజుల శిక్షణ నిర్వహిస్తున్నాం. లైట్ వెహికల్ డ్రైవింగ్ ఉచిత శిక్షణకు సంబంధించి ప్రతిపాదనలు పంపాం. ఇంకా అనుమతి రాలేదు.
- జీవీ రామారావు, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, బొబ్బిలి
Updated Date - Jan 29 , 2024 | 12:27 AM