ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్టీసీని బలోపేతం చేస్తాం

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:48 PM

ఆర్టీసీని మరింతగా బలోపేతం చేసి ప్రజా రవాణాను, ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తామని ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సీయ్యారి దొన్నుదొర అన్నారు. సోమవారం ఉదయం ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం వద్ద ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, జోనల్‌ చైర్మన్‌తో ప్రమాణం చేయించారు.

ఆర్టీసీని బలోపేతం చేస్తాం

విజయనగరం నుంచి పాడేరుకు బస్సు సౌకర్యం

ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సీయ్యారి దొన్నుదొర

విజయనగరం రింగురోడ్డు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని మరింతగా బలోపేతం చేసి ప్రజా రవాణాను, ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తామని ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సీయ్యారి దొన్నుదొర అన్నారు. సోమవారం ఉదయం ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం వద్ద ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, జోనల్‌ చైర్మన్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం దొన్నుదొర మాట్లాడుతూ, ప్రయాణికులకు రక్షణ కల్పించి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామన్నారు. విజయనగరం నుంచి అరకు మీదుగా పాడేరుకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ ప్రాంతం నుంచి పర్యాటకులు, ఉద్యోగులు అరకు, పాడేరు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఈ బస్సు వల్ల ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. ఆర్టీసీలో నష్టాలు తగ్గించేందుకు సంస్థ ఉద్యోగుల సహకారం తీసుకుంటామన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. తనకి ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కొత్త బస్సులను ప్రారంభించిన చైర్మన్‌ కొనకళ్ల నారాయణ

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం శ్రీకాకుళం-విశాఖ మధ్య నాన్‌స్టాప్‌లుగా నడిపేందుకు వీలుగా రెండు ఆల్ర్టా డీలక్స్‌, ఒక ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, జోనల్‌ చైర్మన్‌ దొన్నుదొరతో కలిసి ప్రారంభించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ, ప్రయాణిలకు అత్యున్నత సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, ఆర్టీసీ ఈడీ పి.విజయ్‌కుమార్‌, జిల్లా ప్రజారవాణాధికారి సీహెచ్‌ అప్పలనారాయణ, పార్వతీపురం డీపీటీఓ కె.శ్రీనివాసరావు, అనకాపల్లి డీపీటీఓ కె.పద్మావతి, డిప్యూటీ సీఈఓ పీవీ నాగేశ్వరరావు, డిప్యూటీ సీపీఎం సుధాబిందు తదితరులు పాల్గొన్నారు.

- ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఇక్కడికి వచ్చిన చైర్మన్‌ కొనకళ్ల నారాయణను ఉద్యోగులు కలిసి వినతిపత్రం సమర్పించారు. యూనియన్‌ నాయకుడు అశోక్‌ మాట్లాడుతూ, ఆర్టీసీలో థర్డ్‌పార్టీ విధానం రద్దు చేసి అందరికీ నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

- ఆర్టీసీ చైర్మన్‌, జోనల్‌ చైర్మన్‌ రాకతో ప్రింట్‌, అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కవరే జీ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు హల్‌చల్‌ చేశారు. కవరేజీకి వెళ్లనీయకుండా దురుసుగా ప్రవర్తించడంతో ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులు తీవ్ర నిరాశ పడ్డారు.

Updated Date - Nov 25 , 2024 | 11:48 PM