విధుల్లోకి పాలకొండ డీఎస్పీ
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:15 PM
పాలకొండ డీఎస్పీగా ఎం.రాంబాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం ఇంటిలిజెన్సీ డీఎస్పీగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు.
పాలకొండ: పాలకొండ డీఎస్పీగా ఎం.రాంబాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం ఇంటిలిజెన్సీ డీఎస్పీగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. తొలుత ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో డీఎస్పీకి కండువా కప్పి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. అనంతరం డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ డివిజన్‌లో శాంతిభద్రతలపై దృష్టి పెడతామని తెలిపారు. గంజాయి, తదితర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి ప్రారంభమయ్యే కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా గతంలో ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన జీవీ కృష్ణారావును వీఆర్‌కు పంపించారు. - బెలగాం: పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు శుక్రవారం పార్వతీపురంలో ఎస్పీ మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలని ఎస్పీ ఆయనకు సూచించారు. ప్రజలకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలని, ఏవోబీ సరిహద్దు ప్రాంతాలపై నిఘాపెట్టాలని తెలిపారు.
Updated Date - Sep 20 , 2024 | 11:15 PM