ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పిన తుఫాన్‌ ముప్పు

ABN, Publish Date - Oct 25 , 2024 | 11:37 PM

జిల్లాకు దానా తుఫాన్‌ ముప్పు తప్పింది. దీంతో జిల్లా రైతాంగం ఊపిరిపీల్చుకుంది. తుఫాన్‌ ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని.. గురు, శుక్రవారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

చిన్నపాటి గాలులకు నేలకొరిగిన వరి పంట

- ఊపిరిపీల్చుకున్న జిల్లా రైతాంగం

పాలకొండ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు దానా తుఫాన్‌ ముప్పు తప్పింది. దీంతో జిల్లా రైతాంగం ఊపిరిపీల్చుకుంది. తుఫాన్‌ ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని.. గురు, శుక్రవారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఒడిశా వద్ద తుఫాన్‌ తీరం దాటడంతో జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాల్లో వరి, మరో రెండు లక్షల ఎకరాల్లో అరటి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు సాగు అవుతున్నాయి. వరి కోతదశలో ఉంది. ఈ సమయంలో తుఫాన్‌ ప్రభావంతో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందారు. అయితే, గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా చిన్నపాటి గాలులు వీచాయి. దీనివల్ల అక్కడక్కడ వరి చేలు నేలకొరిగాయి. నష్టం పెద్దగా సంభవించలేదని రైతులు చెబుతున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:37 PM