18న పాలకొండలో మినీ జాబ్‌మేళా
ABN, Publish Date - Dec 15 , 2024 | 11:32 PM
పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో ఈ నెల 18న మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శామ్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్వతీపురం,డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో ఈ నెల 18న మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శామ్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొ న్నారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదువుకున్న 18-28 ఏళ్లు లోపు నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు విద్యార్హత ధ్రువ పత్రాలు, ఆధార్‌కార్డు కాపీలు, ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు ఈ 63012 75511 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 11:32 PM