22న ఓటర్ల తుది జాబితా
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:50 PM
ప్రతి బీఎల్‌వో వద్ద ఓటర్ల జాబితా ఉండాలని, పబ్లికేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఇవ్వాలని జిల్లా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిశీలకుడు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఆదేశించారు.
22న ఓటర్ల తుది జాబితా
ప్రతి బీఎల్‌వో వద్ద జాబితా ఉండాలి
జిల్లా పరిశీలకుడు శ్యామలరావు
కలెక్టరేట్, జనవరి 18: ప్రతి బీఎల్‌వో వద్ద ఓటర్ల జాబితా ఉండాలని, పబ్లికేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఇవ్వాలని జిల్లా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిశీలకుడు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న సవరణ ప్రక్రియపై కలెక్టరు ముందుగా వివరించారు. అనంతరం శ్యామలరావు మాట్లాడుతూ సవరణ ప్రక్రియపై నియోజకవర్గాల వారీగా ఆరా తీశారు. రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. నాలుగు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. 22న తుది జాబితాను ప్రచురించి, అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాబితాలను ప్రదర్శించాలని ఆదేశించారు. జాబితాలను గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలకు ఇవ్వడంతో పాటు డిజిటిల్ కాఫీలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో జేసీ మయూర్‌అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, డీఆర్‌వో అనిత, నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:50 PM