చిట్టంపాడుకు ఎస్‌టీ కమిషన్ చైర్మన్ చిట్టంపాడుకు ఎస్‌టీ కమిషన్ చైర్మన్
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:21 AM
మూలబొడ్డ వర పంచాయతీ గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడులో తల్లీబిడ్డలు రోజుల వ్యవధిలో అనారోగ్యంతో మృతిచెంది న ఘటనపై ‘బైక్‌పై తెచ్చి’ అన్న వార్తకు ఎస్‌టీ కమి షన్ చైర్మన్ డీవీజీ శంకరరావు స్పందించారు. ఇందులో భాగంగా బుధవారం కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర రావు.. మృతిచెందిన మహిళ కుటుంబం ఉన్న చిట్టంపా డు గ్రామానికి వెళ్లారు.
శృంగవరపుకోట రూరల్, జనవరి 17: మూలబొడ్డ వర పంచాయతీ గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడులో తల్లీబిడ్డలు రోజుల వ్యవధిలో అనారోగ్యంతో మృతిచెంది న ఘటనపై ‘బైక్‌పై తెచ్చి’ అన్న వార్తకు ఎస్‌టీ కమి షన్ చైర్మన్ డీవీజీ శంకరరావు స్పందించారు. ఇందులో భాగంగా బుధవారం కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర రావు.. మృతిచెందిన మహిళ కుటుంబం ఉన్న చిట్టంపా డు గ్రామానికి వెళ్లారు. అక్కడి యువత, మృతురాలి భర్త గంగులుతో మాట్లాడారు. ఈ సందర్భంగా గంగులు మాట్లాడుతూ పది రోజుల క్రితం తన బిడ్డ అనారోగ్యం పాలైతే విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకెళ్లామని చెప్పాడు. అక్కడ వైద్యం మాత్రమే చేస్తున్నారు తప్ప ఉచితంగా మందులు ఇవ్వలేద న్నాడు. తాము ఎస్‌టీలమని... తమకు ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తుంది కదా అని ప్రశ్నిస్తే... ‘మందులు ఏమీ ఇవ్వం’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం బాధ కలిగించిందన్నారు. ‘మీరు గిరిజనులైతే ఐటీడీఏ నుంచి లేఖ తేవాలని... లేదంటే మందులు బయట కొనుక్కోవాల’ని ఖరాఖండిగా చెప్పారన్నారు. అందుకే భీమిలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లామని వివరించాడు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గతంలో కొంతమంది వైద్యం అందక చనిపోయారని గిరిజన యువత వివరించారు. సంఘ నాయకుడు గౌరీష్ మాట్లా డుతూ గిరిజనులకు కనీస సౌకర్యాలు లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నా రని తెలిపారు. పోడు భూములు సాగుచేస్తున్నా పట్టాలు ఇవ్వకపోవడంతో రైతుభరోసా వంటి పథ కాలు వర్తించడం లేదని తెలిపారు. వీటిపై స్పం దించిన చైర్మన్ మాట్లా డుతూ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి నివేదిక కోరారని... అందుకే తానే స్వయంగా వచ్చి కష్టాలు విన్నానని తెలిపారు. వీటిని గురువారం ముఖ్య మంత్రితో జరిగే సమావేశంలో వివరి స్తామని తెలిపారు. అనంతరం మృతిచెందిన గంగమ్మ, ఆమె బిడ్డకు అందించిన వైద్యసేవలు, ఇతర అంశాలపై వైద్యురాలు శిరిషను అడిగి తెలుసుకున్నారు. డీవీజీ వెంట గిరిజన సంఘ నాయకుడు అప్పల రాజు దొర, కొట్టాం పీహెచ్‌సీ వైద్యురాలు శిరిష తదితరులు ఉన్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో తమ గ్రామానికి ఎస్‌టీ కమిషన్ చైర్మన్ వచ్చారని... తమ కష్టాలు రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలిశాయని గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jan 18 , 2024 | 12:21 AM