అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
ABN, Publish Date - Oct 12 , 2024 | 12:12 AM
విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుంక లాం సమీపంలో బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు దిశ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఇ.నర్సింహమూర్తి తెలిపారు
విజయనగరం క్రైం: విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుంక లాం సమీపంలో బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు దిశ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఇ.నర్సింహమూర్తి తెలిపారు. భీమునిపట్నంలోని ఒక ఫౌలీ్ట్రఫారంలో ఒక కుటుంబం కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. వారి కు మార్తె దివ్యాంగురాలు కావడంతో ఆమె కూడా వారితో పాటే ఉంటోంది. అదే పౌలీ్ట్రలో పాచిపెంటకు చెందిన పిన్నింటి రాజేంద్ర(45) కూలి పని చేస్తున్నాడు. ఈ నెల 9న రాజేంద్ర దివ్యాంగురాలైన బాలికకు మాయమాటలు చెప్పి మోటారు సైకిల్‌పై తీసు కువెళ్లాడు. రాజేంద్ర బాలికపై గుంకలాం గ్రామంలోని మామిడితోటలో అత్యాచారం చేసి.. జంక్షన్‌లో ఉన్న పాన్‌షాప్‌కు వచ్చి బాలికను, మోటారు సైకిల్‌ను అక్కడే వది లేసి పరారయ్యాడు. పాన్‌షాప్ యజమానికి అనుమానం వచ్చి రూరల్ పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నర్శింహమూర్తికి దర్యాప్తు మొదలుపెట్టారు. నిందుతుడిని పి.కోన వలస వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.
Updated Date - Oct 12 , 2024 | 12:12 AM