రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:23 AM
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి
కొత్తవలస, జనవరి 17: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని ఘోషాసుత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న ఇందిర (60) స్థానిక కొత్తవలస- విజయనగరం రోడ్డు లోని పీఎంఎల్ కాంప్లెక్స్ సమీపంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఎప్ప టిలాగే బుధవారం సాయంత్రం విశాఖపట్టణం నుంచి ఇంటికి భర్తతో కలిసి స్కూటీపై వస్తోంది. మండలంలోని విశాఖపట్టణం-అరుకు రహదారిలో దేశపాత్రునిపాలెం కాటా వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారు స్కూటీని ఢీకొనడంతో స్కూటీపై కూర్చున్న ఇందిర కిందపడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఇందిరపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో భర్తకు గాయాలేవీ తగలలేదు. దీనిపై పోలసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jan 18 , 2024 | 12:23 AM