స్వర్ణాంధ్ర సాధనకు దశ సూత్రాలు
ABN, Publish Date - Nov 23 , 2024 | 05:41 AM
రాష్ట్రంలోని సహజ వనరులను వినియోగించుకుంటూ, రాష్ట్ర స్థితిగతులు పూర్తిగా మార్చేలా స్వర్ణాంధ్రప్రదేశ్-2047 పేరుతో 10 సూత్రాల ప్రణాళికను టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది.
పేదరిక నిర్మూలనే ఎజెండాగా విజన్-2047 ఆవిష్కరణ
‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్’ బ్రాండ్ అభివృద్ధిపై దృష్టి
పారిశ్రామిక పార్కులతో భారీగా ఉపాధి కల్పన
2 మెగా పోర్టులు, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు
తక్కువ ధరకే సౌర, పవన విద్యుత్తు.. కృత్రిమ మేధ కేంద్రంగా ఆంధ్ర
అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సహజ వనరులను వినియోగించుకుంటూ, రాష్ట్ర స్థితిగతులు పూర్తిగా మార్చేలా స్వర్ణాంధ్రప్రదేశ్-2047 పేరుతో 10 సూత్రాల ప్రణాళికను టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంతానికీ ప్రయోజనం కలిగేలా.. సహజ వనరులను అభివృద్ధికి ఉపయోగించుకునేలా ఈ దశ సూత్రాలను రూపొందించారు. సీఎం చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఆవిష్కరించిన విజన్-2047లో.. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. నైపుణ్యం గల మానవ వనరుల అభివృద్ధి, ప్రపంచస్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, డీప్‌టెక్ పరిజ్ఞానానికి పెద్ద పీట వేశారు. దశ సూత్రాలివీ..
1. పేదరిక నిర్మూలన..
ప్రతి కుటుంబానికీ సొంత ఇంటి స్థలం, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సాగునీరు, పైపుల ద్వారా నీటి సరఫరా, 24 గంటలూ కరెంటు, సురక్షిత ఇంధనం, డ్రైనేజీ సౌకర్యం, సోలార్ రూఫ్‌టాప్, డిజిటల్ కనెక్టివిటీ. ప్రతి ఇంటి నుంచీ ఒక పారిశ్రామికవేత్తకు ప్రోత్సాహకం.. ప్రభుత్వ ఆరోగ్యం, విద్యా, నైపుణ్య పథకాల ద్వారా ప్రతి కుటుంబానికీ సామాజిక భద్రత కల్పన. తక్కువ ధరకే వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం.. సమగ్ర బీమా కల్పనతో పాటు, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతిపాదించిన పీ-4 విధానంలో ప్రజలను భాగస్వాములను చేయడం, తెలుగు ఎన్నారైల సహకారంతో పేదరికం నిర్మూలనకు కృషి..
2. ఉపాధి కల్పన..
ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు, టౌన్‌షి్‌పల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చి గ్రామాలు, టౌన్లను ఆర్థికంగా బలోపేతం చేయడం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు.. మహిళా ఎంఎ్‌సఎంఈ పార్కుల ఏర్పాటుతో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, మెరుగైన, ప్రపంచస్థాయి ఉత్పత్తుల తయారీకి కావసిన సౌకర్యాలు కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాల సృష్టి. పది లక్షల వర్క్‌స్టేషన్ల సృష్టి. గ్రామాల్లో, పట్టణాల్లో అనుకూలంగా ఉండే ఒక చిన్న ఇంట్లో నలుగురైదుగురు పని చేసుకునే విధంగా ఏర్పాట్లు. ఇంట్లో పని చేయడం ఇబ్బందిగా ఉన్నవారికి వర్క్‌స్టేషన్‌లో పని చేసుకునే అవకాశం.
3. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి..
అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణ కోసం రిమోట్ కేంద్రాల ఏర్పాటు.. ఆరో తరగతి నుంచే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణను తప్పనిసరి చేయడం, 100 శాతం డిజిటల్ అక్షరాస్యత సాధన, విద్యాలయాల్లో నైపుణ్యాల నాణ్యత కోసం స్కిల్ ఆడిటింగ్ సెల్ ఏర్పాటు. 5వ తరగతి చదివేవాళ్లకు 15 ఏళ్ల తర్వాత ఎలాంటి విజ్ఞానం అవసరమో అలాంటి సబ్జెక్టు తీసుకురావడం.. ఆరోగ్యానికి కూడా టెక్నాలజీ వినియోగం.
4. నీటి సంరక్షణ..
ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటి సరఫరా.. పరిశ్రమలు సహా అన్ని రంగాల్లోనూ సమర్థ నీటి నిర్వహణ.. వ్యవసాయం, ఇతర రంగాలకు మెరుగైన నీటి సరఫరా కోసం నదుల అనుసంధానం.. రాష్ట్రంలో సాగుకు అనువుగా ఉన్న ప్రతి ఎకరాకు నీరివ్వడం.. డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఉపయోగపడే విధానాలు అమల్లోకి తేవడం, వర్షపు నీటిని వినియోగించుకోవడం లాంటి విధానాల ద్వారా నీటి సంరక్షణ. గోదావరి జలాలు గోదావరి నుంచి బనకచర్ల వరకూ.. అటు ఎడమ వైపు వంశధార వరకూ నీళ్లు తీసుకెళ్తే దక్షిణ భారతంలో ఆంధ్ర నంబర్ వన్ అవడంతో పాటు వేరే రాష్ట్రాలకు కూడా నీరివ్వొచ్చు.
5. రైతు-వ్యవసాయ టెక్నాలజీ
ప్రపంచ స్థాయిలో ఉత్తమ విధానాలు, ప్రమాణాల అమలుతో రైతుల ఆదాయం పెంపు.. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, నిల్వ, ఎగుమతుల కోసం ఉత్తమ విధానాలు అవలంబించడం.. భూసారం పెంచడానికి, వ్యవసాయ ఖర్చు తగ్గించడం కోసం ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్(ఏపీసీఎన్‌ఎఫ్) విస్తరణ.. ఉద్యానవన, ఆక్వాకల్చర్ క్లస్లర్లకు ప్రోత్సాహం. కృత్రిమ మేధ (ఏఐ), డ్రోన్లు, రోబోటిక్స్, శాటిలైట్ టెక్నాలజీ ద్వారా క్రిమికీటకాలను గుర్తించి నియంత్రించడం.. సాగు వసతుల పెంపు.. భూసారం పర్యవేక్షణ.. పంట ఆరోగ్యం, ఉత్పాదకత ఎప్పటికప్పుడు అంచనా.. గ్లోబల్ మార్కెట్లలో డిమాండ్ ఉన్న ఉత్పత్తులను ఏపీలోనే తయారుచేయడం.. ఆక్వాకల్చర్, హార్టీకల్చర్, కాఫీ, మసాలా దినుసులు, నూనె గింజలకు ప్రత్యేకమైన హబ్‌ల ఏర్పాటు..
6. ప్రపంచస్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు
రాష్ట్ర, జాతీయ హైవేల కనెక్టివిటీ ద్వారా రవాణా సౌకర్యాల మెరుగుదల.. రాష్ట్రవ్యాప్తంగా హైస్పీడ్ రైల్ ట్రాకుల ఏర్పాటు.. రెండు మెగా పోర్టుల నిర్మాణం, మూడు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాల ఏర్పాటు.. సరుకు రవాణాకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలతో రెండు కోస్టల్ ఎకనమిక్ జోన్ల ఏర్పాటు.. విశాఖ, మచిలీపట్నం, అనంతపురం, ఓర్వకల్లులో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు.. 4జీ, 5జీ, 6జీ స్థాయి సామర్థ్యం గల టెలికాం సేవలు అందుబాటులోకి తేవడం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం.
7. తక్కువ ధరలకే విద్యుత్..
సౌర, పవన, పంప్డ్ విద్యుత్‌ను రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకే అందుబాటులోకి తేవడం.. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ల ఏర్పాటు.. 2047 నాటికి కర్బన ఉద్గారాలను జీరో చేసి, స్థిరమైన వృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం.. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ యోజనలతో ప్రతి ఇంటినీ గ్రీన్ హౌస్‌గా మార్చడం.
8. అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ
ఇన్నొవేషన్ జిల్లాలను అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు, యూనివ ర్సిటీలు, కార్పొరేషన్లకు అనుసంధానించడం, ఇన్నొవేషన్‌కు అనుగుణంగా ఇంక్యుబేషన్ పార్కులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటు.. ‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్’ను గ్లోబల్ బ్రాండ్‌గా అభివృద్ధి చేయడం, ఆక్వాకల్చర్ ఉత్పత్తుల ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు.
9. స్వచ్ఛాంధ్ర..
స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన పరిసరాలు అందరికీ అందుబాటులోకి తేవడం.. టెక్నాలజీ ఆధారిత వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు.. ప్రపంచ స్థాయిలో జీవించడానికి అత్యంత అనువైన నగరాల జాబితాలో రాష్ట్రం నుంచి రెండు ప్రాంతాలను చేర్చడం.. గ్రీన్ బాండ్లు, కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్‌కు ప్రోత్సాహం.
10. డీప్ టెక్..
ప్రపంచస్థాయిలో ఏపీని ఏఐకి హబ్‌గా మార్చడం.. అదే స్థాయిలో టెక్నాలజీ సేవలందించే 4 హబ్‌ల ఏర్పాటు. దేశ డ్రోన్ రాజఽధానిగా రాష్ట్రం అభివృద్ధి.. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, జీనోమిక్స్ రంగాల్లో టెక్నాలజీ ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు.
Updated Date - Nov 23 , 2024 | 05:41 AM