చింతపల్లి డీఎఫ్‌వోగా వెంకట నరసింహరావు బాధ్యల స్వీకారం
ABN, Publish Date - Oct 10 , 2024 | 11:06 PM
స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో)గా వై. వెంకట నరసింహరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. తాజా బదిలీల్లో ఇక్కడ ఏడాదిన్నర పాటు విధులు నిర్వహించిన డీఎఫ్‌వో చిట్టపులి సూర్యనారాయణను ఏలూరు బదిలీ చేసి ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకట నరసింహరావుని నియమించిన విషయం తెలిసిందే.
చింతపల్లి, అక్టోబరు 10: స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో)గా వై. వెంకట నరసింహరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. తాజా బదిలీల్లో ఇక్కడ ఏడాదిన్నర పాటు విధులు నిర్వహించిన డీఎఫ్‌వో చిట్టపులి సూర్యనారాయణను ఏలూరు బదిలీ చేసి ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకట నరసింహరావుని నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఆయన డీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అటవీ సంపద సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రాంతీయ పరిస్థితులను అవగాహన చేసుకుని సమర్థవంతంగా సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయనకు స్థానిక రేంజ్ అధికారి అప్పారావు, డీఆర్వో వెంకటరాజు, ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Oct 10 , 2024 | 11:06 PM