మండుతున్న కూరగాయల ధరలు
ABN, Publish Date - Oct 06 , 2024 | 11:21 PM
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నర్సీపట్నంలో రైతుబజార్ లేకపోవడం, అధికారుల నియంత్రణ కొరవడడంతో చింతపల్లి రోడ్డు, ఇందిరా మార్కెట్, పెదబొడ్డేపల్లి, బలిఘట్టం మార్కెట్లలో కూరగాయల వ్యాపారులు ఒక్కో చోట ఒక్కో ధరకు విక్రయిస్తున్నారు. దీంతో కూరగాయల ధరలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది.
టమాటా కిలో రూ.80
పాత ఉల్లిపాయలు రూ.60
చిక్కుడుకాయలు రూ.120
వంకాయలు, బెండ, దొండ ధరలలు కిలో రూ.60
నర్సీపట్నం, అక్టోబరు 6: మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నర్సీపట్నంలో రైతుబజార్ లేకపోవడం, అధికారుల నియంత్రణ కొరవడడంతో చింతపల్లి రోడ్డు, ఇందిరా మార్కెట్, పెదబొడ్డేపల్లి, బలిఘట్టం మార్కెట్లలో కూరగాయల వ్యాపారులు ఒక్కో చోట ఒక్కో ధరకు విక్రయిస్తున్నారు. దీంతో కూరగాయల ధరలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. ఉల్లి, వెల్లుల్లి, టమాటా, అల్లం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్లో ఆదివారం చిక్కుడు కాయలు కిలో రూ.120లు, కొత్త ఉల్లిపాయలు కిలో రూ.35 నుంచి రూ.40లు, పాత ఉల్లిపాయలు రూ.60లకు విక్రయించారు. క్యాప్సికం రూ.80లు, దొండ, బెండ, వంకాయలు కిలో రూ.60లు చొప్పున విక్రయించారు. అల్లం కిలో రూ.80లు, బంగాళదుంపలు, గోరు చిక్కుడు, పచ్చిమిర్చి కిలో రూ.40లు చొప్పున విక్రయించారు.
ఠారెత్తిస్తున్న టమాటా
హోల్‌సేల్‌లో టమాటా క్రేటు రూ.1800లు ఉంది. విడిగా కిలో రూ.80లకు విక్రయించారు. టమాటా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వస్తుంది. మదనపల్లి మార్కెట్ నుంచి తమిళనాడుకు ఎగుమతి అయిపోవడంతో డిమాండ్ పెరిగిపోతుంది. రోజురోజుకి ధర పెరిగిపోతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వేలాది మంది భవానీ మాలలు ధరించారు. దీంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి.
Updated Date - Oct 06 , 2024 | 11:21 PM