ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపమాక ఆలయాన్ని అభివృద్ధి చేయాలి

ABN, Publish Date - Nov 05 , 2024 | 12:36 AM

ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హోం మంత్రి వంగలపూడి అనిత, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె.శ్యామలరావును కోరారు.

టీటీడీ ఈవో శ్యామలరావుకు వినతిపత్రం అందజేస్తున్న హోం మంత్రి అనిత

టీటీడీ ఈవో శ్యామలరావుకు హోం మంత్రి అనిత వినతి

నక్కపల్లి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హోం మంత్రి వంగలపూడి అనిత, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె.శ్యామలరావును కోరారు. సోమవారం ఆమె తిరుమలలో ఈవోతోపాటు జేఈవో వీరబ్రహంలను కలిశారు. ఉపమాక ఆలయంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉపమాక ఆలయం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని ఆరోపించారు. తన నియోజకవర్గంలో వున్న ఉపమాక క్షేత్రాన్ని రానున్న ఐదేళ్లల్లో తగిన రీతిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేపట్టాల్సిన నిర్మాణాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, ఆలయ మాజీ చైర్మన్‌ కొప్పిశెట్టి బుజ్జి ఇటీవల హోం మంత్రికి ఇచ్చిన వినతిపత్రాన్ని ఆమె టీటీడీ ఈవో శ్యామలరావుకు అందజేశారు. కొండపైకి ఘాట్‌ రోడ్డు, ముఖ మండపం నిర్మాణం, కింద ఆలయంలో మూడు రాజగోపురాలు, కల్యాణ మండపం, పార్కింగ్‌ షెడ్డు, కేశఖండనశాల, అన్నదాన భవనం, గోశాల నిర్వహణ, నక్కపల్లి నుంచి ఉపమాక వరకు రహదారి విస్తరణ, భక్తుల కోసం విశ్రాంతి గదులు, డార్మిటరీ, మంచినీటి వసతి, పుష్కరిణి అభివృద్ధి పనులు చేపట్టాలని హోం మంత్రి కోరారు. ఉపమాక ఆలయాన్ని ఒకసారి సందర్శించి, వాస్తవ పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలని మంత్రి కోరగా, ఈవో శ్యామలరావు సానుకూలంగా స్పందించారు.

Updated Date - Nov 05 , 2024 | 12:36 AM