ఎన్టీఆర్‌కు ఘన నివాళి
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:17 PM
దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు.
పాడేరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, కీలకమైన గ్రామాల్లో సైతం ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ పాడేరు నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పాలు, రొట్టెలను పంచిపెట్టారు. అరకులోయలో పార్లమెంట్ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, అరకులోయ అసెంబ్లీ ఇన్‌చార్జి సియ్యారి దొన్నుదొర అరకులోయలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
Updated Date - Jan 18 , 2024 | 11:17 PM