ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లంబసింగికి పర్యాటకుల తాకిడి

ABN, Publish Date - Sep 22 , 2024 | 11:15 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వాతావరణంలో మార్పు రావడం, మంచు కురుస్తుండడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద మంచు అందాలను తిలకిస్తున్న పర్యాటకులు

ప్రకృతి అందాల వీక్షణకు బారులు

చెరువులవేనం వద్ద ఫొటోలకు పోటీ

చింతపల్లి, సెప్టెంబరు 22: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వాతావరణంలో మార్పు రావడం, మంచు కురుస్తుండడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఆదివారం భారీ సంఖ్యలో పర్యాటకులు లంబసింగికి తరలివచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం వద్ద పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద పర్యాటకులు మంచు అందాలను తిలకిస్తూ ఎంజాయ్‌ చేశారు. పచ్చని అడవులను తాకుతూ పయనిస్తున్న మంచు మేఘాల సరసన ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి.

Updated Date - Sep 22 , 2024 | 11:15 PM