ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సెర్ప్‌ ఉద్యోగులు అర్ధనగ్నంగా నిరసన

ABN, Publish Date - Jan 30 , 2024 | 01:06 AM

తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూన సొసైటీ) ఉద్యోగులు సోమవారం అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. సెర్ప్‌ ఉద్యోగులు ఈ నెల 27వ తేదీ నుంచి సమ్మె చేస్తూ నెహ్రూచౌక్‌లోని బస్టాప్‌ వద్ద దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

అర్ధనగ్నంగా దీక్ష చేస్తున్న సెర్ప్‌ ఉద్యోగులు

మూడో రోజుకు చేరిన సమ్మె

అనకాపల్లి టౌన్‌, జనవరి 29: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూన సొసైటీ) ఉద్యోగులు సోమవారం అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. సెర్ప్‌ ఉద్యోగులు ఈ నెల 27వ తేదీ నుంచి సమ్మె చేస్తూ నెహ్రూచౌక్‌లోని బస్టాప్‌ వద్ద దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం నియమించిన మంత్రుల సబ్‌ కమిటీ ద్వారా సెర్ప్‌ను ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక ఉద్యోగులకు పే స్కేల్‌ అమలు చేసి సర్వీస్‌ను రెగ్యులర్‌ చేయాలని కోరారు. ఇందుకోసం ఆర్థిక శాఖ ద్వారా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పరిధిలో శాంక్షన్‌ పోస్టులుగా గుర్తిస్తూ ఇచ్చిన సర్క్యూలర్‌ మెమోపై తగు జీవో విడుదల చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్నట ఈపీఎఫ్‌ సీలింగ్‌ విధానాన్ని ఎత్తివేసి మూలవేతనంపై నూరు శాతం ఈపీఎఫ్‌ను అమలు చేయాలని కోరారు. హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించాలని, కారుణ్యనియామకాలు జరిపి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలని, పదవీవిరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్‌, నానిబాబుల, పలువురు ఏపీఎం, సీసీలు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 01:06 AM

Advertising
Advertising