ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సింహాద్రి ఎన్టీపీసీలో రెండో యూనిట్‌ షట్‌డౌన్‌

ABN, Publish Date - Nov 12 , 2024 | 01:51 AM

సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(ఎన్టీపీసీ)లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను అధికారులు ఆదివారం అర్ధరాత్రి షట్‌డౌన్‌ చేశారు.

వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం 50 రోజులపాటు ఉత్పత్తి నిలిపివేత

పరవాడ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):

సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(ఎన్టీపీసీ)లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను అధికారులు ఆదివారం అర్ధరాత్రి షట్‌డౌన్‌ చేశారు. వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం 50 రోజులపాటు ఉత్పత్తి నిలిపివేస్తారు. యూనిట్‌లోని అన్ని విభాగాల్లో నిర్వహణ, మరమ్మతు పనులు చేపడతారు. ఇందుకోసం అదనంగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటారు. నిర్వహణ పనులు పూర్తయిన తరువాత విద్యుదుత్పత్తిని పునఃప్రారంభిస్తారు. కాగా ఒకటి, మూడు, నాలుగు యూనిట్‌ల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతున్నదని ప్లాంట్‌ పీఆర్‌ఓ అఖిల్‌ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Nov 12 , 2024 | 01:51 AM