సాగునీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు
ABN, Publish Date - Sep 21 , 2024 | 10:51 PM
ఈ నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాజెక్టులు
82 మైనర్ ఇరిగేషన్ పనులకు రూ.26 కోట్లు
మేజర్ ఇరిగేషన్ పనులకు రూ.2.63 కోట్లతో అంచనాలు
నర్సీపట్నం, సెప్టెంబరు 21: ఈ నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నర్సీపట్నం డివిజన్‌లో చెరువులు, చిన్న రిజర్వాయర్లు, గ్రోయిన్లు, తదితర 82 మైనర్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించి తాత్కాలిక మరమ్మతులకు రూ.2.28 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. శాశ్వత పరిష్కారానికి రూ.26 కోట్లు అవుతుందని ప్రతిపాదించారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు తాండవ కాలువ 32 చోట్ల దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఉదాహరణకు తాండవ కుడికాలువ 1.4 కిలోమీటరు వద్ద మట్టి జారిపోయింది. ఎడమ కాలువకు 2.4 కిలోమీటరు వద్ద గండి పడింది. తాండవ ప్రాజెక్టు పరిధిలో 32 పనుల తాత్కాలిక మరమ్మతులకు రూ.7.5 లక్షలు, శాశ్వత పరిష్కారానికి రూ.2.63 కోట్లు అవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని డీఈఈ బి.గుంపస్వామినాయుడు తెలిపారు.
Updated Date - Sep 21 , 2024 | 10:51 PM