ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వయోవృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఆప్షన్‌

ABN, Publish Date - Jan 12 , 2024 | 01:06 AM

ఎనభై సంవత్సరాలు దాటిన వారికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినయోగించుకునే అవకాశం కల్పించిందని ఆర్డీవో జయరాం చెప్పారు. గురువారం వయోవృద్ధుల సంక్షేమ సంఘం, ప్రభుత్వ పింఛన్‌దారుల సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల 80 ఏళ్లు దాటిన వారిలో 40-50 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు ఎన్నికల కమిషన్‌ గుర్తించిందన్నారు.

మాట్లాడుతున్న ఆర్డీవో జయరాం

ఎన్నికల కమిషన్‌ వెసులుబాటు: ఆర్డీవో

నర్సీపట్నం, జనవరి 11 : ఎనభై సంవత్సరాలు దాటిన వారికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినయోగించుకునే అవకాశం కల్పించిందని ఆర్డీవో జయరాం చెప్పారు. గురువారం వయోవృద్ధుల సంక్షేమ సంఘం, ప్రభుత్వ పింఛన్‌దారుల సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల 80 ఏళ్లు దాటిన వారిలో 40-50 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు ఎన్నికల కమిషన్‌ గుర్తించిందన్నారు. అందరూ ఓటు హక్కు వినయోగించుకోవడానికి వయో వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఆప్షన్‌ ఇచ్చిందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించు కోవచ్చునని, రాలేని వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. బీఎల్‌వో 80 సంవత్సరాలు దాటిన వారి వద్దకు వెళ్లి ఆప్షన్‌ తెలుసుకుంటారనిఇ అన్నారు. వయోవృద్ధులతోపాటు నడవ లేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం వుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పెన్షన్‌దారుల సంఘం అధ్యక్షుడు గజ్జాలమ్మ, సినియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కేవీ సుబ్బారావు, తహసీల్దార్‌ అన్నాజీరావు, ఎలక్షన్‌ డీటీ సుధావాణి పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 06:44 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising