పాడేరు బీజేపీకే..!
ABN, Publish Date - Mar 24 , 2024 | 12:16 AM
అరకులోయ పార్లమెంట్ స్థానం పరిధిలోని పాడేరు, పాలకొండ అసెంబ్లీ స్థానాల ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. కూటమిలో భాగంగా పాడేరులో భారతీయ జనతా పార్టీ, పాలకొండలో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతున్నది.
జనసేనకు పాలకొండ?
నాలుగు రోజుల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశఽం
అరకులోయ పార్లమెంట్ పరిధిలో ఐదు టీడీపీకి, బీజేపీ, జనసేనకు చెరో సీటు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
అరకులోయ పార్లమెంట్ స్థానం పరిధిలోని పాడేరు, పాలకొండ అసెంబ్లీ స్థానాల ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. కూటమిలో భాగంగా పాడేరులో భారతీయ జనతా పార్టీ, పాలకొండలో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. మరో నాలుగు రోజుల్లో పాడేరు, పాలకొండ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాలనే ఆలోచనతో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలున్నారని తెలిసింది. దీంతో ప్రస్తుతానికి పాడేరు పాలకొండ అసెంబ్లీ స్థానాలను ఏ పార్టీకి కేటాయిస్తారనే దానిపై ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కొంత వరకు తె రపడింది.
అరకులోయ ఎంపీ పరిధిలో ఐదు అసెంబ్లీలు టీడీపీకే..
అరకులోయ అసెంబ్లీ స్థానం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు ఐదు తెలుగుదేశం పార్టీకి, ఒక్కొక్కటి చొప్పున బీజేపీ, జనసేనకు కేటాయించారని తెలుస్తున్నది. అలాగే అరకులోయ ఎంపీ స్థానం బీజేపీకి కేటాయించగా... దాని పరిధిలోని రంపచోడవరం స్థానానికి మిర్యాల శిరీష, పార్వతీపురానికి బోనెల విజయ్, సాలూరుకు గుమ్మడి సంధ్యారాణి, కురుపాం తొయ్యాక జగదీశ్వరి, అరకులోయకు సియ్యారి దొన్నుదొరను తమ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. కాగా పొత్తులో భాగంగా అరకులోయ పార్లమెంట్ పరిధిలో పాడేరు ఎమ్మెల్యే స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి, పాలకొండను జనసేనకు కేటాయించాని ఉమ్మడి పార్టీల నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఆ రెండు స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ఇంకా ఖరారు లేదు. దానిపైనే బీజేపీ, జనసేన నేతలు కసరత్తు చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తమ అభ్యర్థులను బీజేపీ, జనసేన ప్రకటించనున్నాయి.
Updated Date - Mar 24 , 2024 | 12:16 AM