ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన ఉత్పత్తుల కోసం వన్‌దన్‌ హబ్‌లు

ABN, Publish Date - Sep 21 , 2024 | 10:45 PM

గిరిజన ఉత్పత్తుల కోసం వన్‌దన్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ అన్నారు.

మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌, పక్కన డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ

వెలుగు, డీఆర్‌డీఏ అధికారుల

సమావేశంలో ఐటీడీఏ పీవో అభిషేక్‌

పాడేరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): గిరిజన ఉత్పత్తుల కోసం వన్‌దన్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ అన్నారు. డీఆర్‌డీఏ, వెలుగు ఏపీఎంలతో ప్రధానమంత్రి వన్‌దన్‌ వికాస కేంద్రాలపై శనివారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో వీడీవీకేల బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మూడు లేదా నాలుగు వన్‌దన్‌ వికాస కేంద్రాలను అనుసంధానం చేస్తూ వీడీవీకే హబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలో 106 వీడీవీకేలు, 8 ప్రత్యేకంగా పీవీటీజీల వీడీవీకేలున్నాయన్నారు. వాటిలో ఎన్నింటికి భవనాలన్నాయని, సమకూర్చిన యంత్ర పరికరాలు, సభ్యులకు ఇచ్చిన శిక్షణలపై ఆరా తీశారు. అలాగే శిక్షణ పూర్తి చేసిన వీడీవీకేలను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వీడీవీకేల్లో సేకరిస్తున్న అడ్డాకులు, చింతపండు, చీపుర్లు, మిల్లెట్‌ బిస్కెట్ల తయారీకి వీడీవీకేల ద్వారా సేకరిస్తున్న ముడి సరుకులను హబ్‌లకు సరఫరా చేయాలని పీవో అభిషేక్‌ సూచించారు. అలాగే వీడీవీకేల నిర్వహణకు అవసరమైన యంత్ర పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గిరిజన ఉత్పత్తుల సేకరణ కేంద్రాల్లో ఇద్దరు సమన్వయకర్తలను నియమించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అడ్డాకులతో ప్లేట్లు, కప్పుల తయారీ చేయాలన్నారు. అన్ని హబ్‌ల్లో వచ్చే నెలాఖరు నాటికి ఉత్పత్తులు ప్రారంభించాలన్నారు. ఐటీడీఏల్లో నిర్వహించే సమావేశాల్లో వీడీవీకేల ఉత్పత్తులను వినియోగించాలని పీవో అభిషేక్‌ సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవోలు వీఎస్‌.ప్రభాకరరావు, ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, 11 మండలాల వెలుగు ఏరియా కో-ఆర్డినేటర్లు, ఏపీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 10:45 PM