నేడు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
ABN, Publish Date - Dec 05 , 2024 | 11:16 PM
రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుంచి నేరుగా ఘాట్‌లోని అమ్మవారి పాదాలుకు చేరుకుంటారు.
నాదెండ్ల మనోహర్
పాడేరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుంచి నేరుగా ఘాట్‌లోని అమ్మవారి పాదాలుకు చేరుకుంటారు. తరువాత మండలంలోని మినుములూరులో రేషన్ డిపో ను తనిఖీ చేసి, అక్కడ డ్వాక్రా మహిళలతో ముచ్చటిస్తారు. తరువాత స్థానిక సుండ్రుపుట్టు వీధిలోని రేషన్ డిపోను సందర్శించి పీఎంఆర్‌సీ అతిథి గృహానికి చేరుకుని విలేకరులతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం అనంతరం రోడ్డు మార్గంలో విశాఖ తిరుగు ప్రయాణమవుతారు.
Updated Date - Dec 05 , 2024 | 11:16 PM