ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మల్లవరం.. వ్యాధులతో సతమతం

ABN, Publish Date - Dec 13 , 2024 | 12:14 AM

మండలంలోని గదభపాలెం పంచాయతీ మల్లవరం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ గ్రామంలోని జలాలు శుద్ధమైనవికాకపోవడంతో పలువురు మూత్రపిండాల వ్యాధుల బారిన పడ్డారని గ్రామస్థులు చెబుతున్నారు.

మల్లవరం గ్రామం వ్యూ

తాగునీటి సమస్యతో కిడ్నీ సంబంధిత వ్యాధులు

ఏడాది కాలంలో ఎనిమిది మంది మృతి

చికిత్స పొందుతున్న మరో 40 మంది

సమస్యను పరిష్కరించాలని గ్రామస్థుల వేడుకోలు

కొయ్యూరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని గదభపాలెం పంచాయతీ మల్లవరం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ గ్రామంలోని జలాలు శుద్ధమైనవికాకపోవడంతో పలువురు మూత్రపిండాల వ్యాధుల బారిన పడ్డారని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఎనిమిది మంది మృతి చెందగా, ప్రస్తుతం 40 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం స్పందించి తాగునీటి సమస్యను తీర్చాలని, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మల్లవరం గ్రామంలో సుమారు 400 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో రెండు దశాబ్దాల క్రితం మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. అయితే ఆ నీటిని పరీక్షించగా, కలుషితమైనట్టు గుర్తించి రెండేళ్ల క్రితం నుంచి వినియోగించడం మానేశారు. గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాగునీటి పథకంతో పాటు మరో మూడు బోర్లు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే నీరు ఏమాత్రం చాలకపోవడంతో గత ఏడాది సత్యసాయి ట్రస్టు నిర్వాహకులు గ్రామానికి సమీపంలోని తలుపులమ్మ కొండపై గల రావణలంక ఊట నుంచి పైపులైన్‌ వేసి గ్రామంలో రెండు ట్యాంకులు అమర్చి వాటి ద్వారా గ్రామానికి నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఆ నీరు తాగడం వలనో, మరే కారణంతోనో పలువురు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గత ఏడాది కాలంలో గ్రామానికి చెందిన బోడమ్మ, సన్యాసయ్య, తూబరి చెల్లయ్యమ్మ, కూనపు చినబ్బాయి, తూబరి బెన్నమ్మ, నేగుల మల్లయ్యతో పాటు మరో ఇద్దరు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మృతి చెందారు. ప్రస్తుతం తూబరి దారకొండ, చిన్నయ్య, పండ్ర బాలరాజు, తూబరి చంద్రరావు, కూడా పెదరాజులు, పొట్టుకూరి రాజులు, తోలాబు రాజబాబు, కొనకం రమణమ్మ, పొట్టుకూరి సుబ్బారావుతో పాటు మరో 30 మంది వరకు ఈ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా నర్సీపట్నం వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఈ సమస్యను ఇటీవల డౌనూరు పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ దృష్టికి డౌనూరు ఎంపీటీసీ సభ్యుడు బిడజాన అప్పారావు తీసుకువెళ్లారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మరింత మంది వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Dec 13 , 2024 | 12:14 AM