చంద్రన్న సభను విజయవంతం చేద్దాం
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:01 AM
అరకు- జైపూర్ జంక్షన్ మధ్య ఈ నెల 20న నిర్వహించనున్న ‘రా తెలుగుదేశం పిలుస్తోంది.. కదలిరా’ బహిరంగ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ అరకు అసెంబ్లీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు.
- టీడీపీ శ్రేణులకు పార్టీ అరకు అసెంబ్లీ పరిశీలకుడు దువ్వారపు రామారావు పిలుపు
అరకులోయ, జనవరి 17: అరకు- జైపూర్ జంక్షన్ మధ్య ఈ నెల 20న నిర్వహించనున్న ‘రా తెలుగుదేశం పిలుస్తోంది.. కదలిరా’ బహిరంగ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ అరకు అసెంబ్లీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఓ ఫంక్షన్ హాల్‌లో అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అరకు పార్లమెంట్ ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బొర్రా నాగరాజు, ఎంపీవీ ప్రసాద్, గంటా నూకరాజు తదితరులు మాట్లాడుతూ అందరూ సమష్టిగా ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అరకు, పాడేరు, రంపచోడవరం, సాలూరు, కురుపాం, పార్వతీపురం, పాలకొండ ఇన్‌చార్జులు సియ్యారి దొన్నుదొర, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, తదితరులతో పాటు ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు తదితరులు పాల్గొని సభను విజయవంతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎం.మణికుమారి, పాడేరు అసెంబ్లీ పరిశీలకుడు రాజమండ్రి నారాయణ, అరకు, పాడేరు అసెంబ్లీ క్లస్టర్, బూత్,యూనిట్ ఇన్‌చార్జులతో పాటు రెండు నియోజకవర్గాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు.
Updated Date - Jan 18 , 2024 | 12:01 AM