ఏవోబీలో మందుపాతర స్వాధీనం
ABN, Publish Date - Sep 21 , 2024 | 10:49 PM
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని గంపకొండ అటవీ ప్రాంతంలో పోలీసులనే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరను శనివారం ఒడిశా పోలీసులు వెలికి తీశారు.
సీలేరు, సెప్టెంబరు 21 : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని గంపకొండ అటవీ ప్రాంతంలో పోలీసులనే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరను శనివారం ఒడిశా పోలీసులు వెలికి తీశారు. వివరాలిలా ఉన్నాయి.
ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలో బోడిగెట్టకు చెందిన బీఎస్‌ఎఫ్ బలగాలు మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గంపకొండ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంపకొండ కెనాల్ వంతెన వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసు బలగాలు గుర్తించాయి. దీంతో మందుపాతరను నిర్వీర్యం చేసిన అనంతరం, డిటోనేటర్, 30 మీటర్ల వైర్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఒడిశా పోలీసులు తెలిపారు. ఏవోబీలో మావోయిస్టులు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వారు పేర్కొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 10:49 PM