ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ ఓ 420.. ఇది గూగుల్‌ చెప్పేమాట

ABN, First Publish Date - 2024-02-06T00:45:05+05:30

దేశంలో 420 సీఎం ఎవరంటే ఏపీ సీఎం జగన్‌ పేరువస్తుందని, జగన్‌ 420 సీఎం అని తాను చెప్పడం లేదని...గూగుల్‌ చెబుతుందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

సభలో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

ఆయన ఏం చేశారని జనం ఓట్లేయాలి

యువతకు చంద్రబాబు ఐటీలో ఉద్యోగాలు ఇస్తే,

జగన్‌ చేపల దుకాణాలు, బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలు ఇస్తున్నాడు

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు

కె.కోటపాడు, ఫిబ్రవరి 5: దేశంలో 420 సీఎం ఎవరంటే ఏపీ సీఎం జగన్‌ పేరువస్తుందని, జగన్‌ 420 సీఎం అని తాను చెప్పడం లేదని...గూగుల్‌ చెబుతుందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గొండుపాలెంలో ‘రా...కదలిరా’ పేరుతో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్‌ తేలని జగన్‌కు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. పంతొమ్మిదిసార్లు మోదీని కలిసిన జగన్‌, ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన దౌర్భాగ్యుడు జగన్‌ అని, ఆయనకు వంతగాడిగా సజ్జల రామకృష్ణారెడ్డి తయారయ్యారన్నారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన జగన్‌కు జనాలు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు పాలనలో యువకులకు ఐటీలో ఉద్యోగాలు కల్పిస్తే, జగన్‌ పాలనలో చేపల దుకాణాలు, మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇస్తున్నారని విమర్శించారు. జగన్‌ పాలనలో విశాఖను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. తాత తండ్రులు సంపాదించి ఇచ్చిన భూములకు సంబంధించి పత్రాలపై దిష్టిబొమ్మలా జగన్‌ ఫొటోలు ముద్రిస్తున్నారని, ఇది అవసరమా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ బొమ్మ తొలగిస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిన జగన్‌ను గద్దె దించి, రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. పోలీసులు కూడా మారాలని, వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమన్నారు. దోచుకునే దొంగ జగన్‌కు సహకారం అందించవద్దని విజ్ఞపి చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ, ఎస్‌సీ ఎస్‌టీల హత్యలు ఎక్కువైపోయాయని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

అనకాపల్లి ఎంపీ సీటు నా కుమారుడికి లభిస్తే ఆదరించండి

అనకాపల్లి ఎంపీ సీటు కావాలని పార్టీని కోరామని, మాడుగుల మోదకొండమ్మ తల్లి దయతో ఒకవేళ తన కుమారుడికి అవకాశం వచ్చినట్టయితే, తనను ఆశీర్వదించినట్టే తన కుమారుడిని కూడా ఆశీర్వదించి గెలిపించాలని అయ్యన్నపాత్రుడు కోరారు.

Updated Date - 2024-02-06T00:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising