జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు
ABN, Publish Date - Sep 21 , 2024 | 10:37 PM
అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాలు భారీ వర్షాలు పడే అవకాశమున్నదని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
చింతపల్లి, సెప్టెంబరు 21: అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాలు భారీ వర్షాలు పడే అవకాశమున్నదని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. శనివారం ప్రత్యేక వాతావరణ సమాచారాన్ని శాస్త్రవేత్తలు ప్రకటించారు. రెండు రోజులు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నదన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉన్నదన్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. వర్షాలతో వరి పైరు ముంపునకు గురైతే వర్షాల అనంతరం నీటిని బయటకి తీసివేయాలన్నారు. పైరు కాపాడుకునేందుకు 20 కిలోల యూరియా, 2గ్రాముల కార్బెండజిం, మాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 10:37 PM