ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల్లో ప్రలోభ పెడితే కఠిన చర్యలు

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:23 AM

ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఆయన నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని పోలింగ్‌ కేంద్రాలు, చెక్‌ పోస్టులను తనిఖీ చేశారు.

గొలుగొండ మండలంలోని చెక్‌ పోస్టు వద్ద కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ

- పోలింగ్‌ కేంద్రాలు, చెక్‌ పోస్టులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీ

నర్సీపట్నం, మార్చి 28: ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఆయన నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని పోలింగ్‌ కేంద్రాలు, చెక్‌ పోస్టులను తనిఖీ చేశారు. నర్సీపట్నం మండలంలోని గబ్బాడ ఎంపీపీ స్కూల్‌, ఏజెన్సీ లక్ష్మీపురం ఆదర్శ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొలుగొండ మండలం ఎర్రన్నపాలెం, ఏజెన్సీ లక్ష్మీపురంలోని చెక్‌ పోస్టులు తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, మద్యం, నాటుసారా, గంజాయి రవాణాను అరికట్టాలని గొలుగొండ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాన్ని ఆదేశించారు. నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట నర్సీపట్నం రిటర్నింగ్‌ అధికారి హెచ్‌వీ జయరాం, ఎస్‌ఐ ఉపేంద్ర ఉన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:23 AM

Advertising
Advertising