ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ స్థాయి కరాటే పోటీలకు గిరి బాలిక ఎంపిక

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:33 PM

వచ్చే డిసెంబరులో ఢిల్లీ వేదికగా నిర్వహించే జాతీయ స్థాయి కరాటే పోటీలకు మండలంలోని సేరిబయలు గ్రామానికి సరబ తీర్థి(15) ఎంపికైంది.

జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన సరబ తీర్థి

పాడేరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): వచ్చే డిసెంబరులో ఢిల్లీ వేదికగా నిర్వహించే జాతీయ స్థాయి కరాటే పోటీలకు మండలంలోని సేరిబయలు గ్రామానికి సరబ తీర్థి(15) ఎంపికైంది. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన 68వ స్కూల్‌ గేమ్స్‌లో బాలికల కరాటే పోటీల్లో సేరిబయలు గ్రామానికి చెందిన సరబ తీర్థి ప్రతిభచూపింది. 1, 2, 3 రౌండ్లలోనూ తనే విజేతగా నిలిచి డిసెంబరులో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికైంది. మండలంలో కిండంగి పంచాయతీ సేరిబయలు గ్రామానికి చెందిన సరబ యువరాజు, వెంకటపద్మ దంపతుల కుమార్తె సరబ తీర్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో గ్రామస్థులు, కుటుంబీకులు ఆమెకు అభినందనలు తెలిపి, ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 25 , 2024 | 11:33 PM