ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పూర్తయిన తాగునీటి పైపులైన్‌ పనులు

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:11 AM

మండలంలోని పురుషోత్తపురం వద్ద పట్టణానికి తాగునీటి సరఫరా చేసే ప్రధాన పైపులైన్‌ మరమ్మతు పనులు ఆదివారం పూర్తయ్యాయి.

యర్రవరం సంప్‌ను పరిశుభ్రం చేస్తున్న సిబ్బంది

నేటి నుంచి పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా

ఎలమంచిలి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పురుషోత్తపురం వద్ద పట్టణానికి తాగునీటి సరఫరా చేసే ప్రధాన పైపులైన్‌ మరమ్మతు పనులు ఆదివారం పూర్తయ్యాయి. సోమవారం ఉదయం నుంచి మునిసిపాలిటీతోపాటు మండలంలోని గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరా జరుగుతుందని మునిసిపల్‌ అధికారులు తెలిపారు. పైపులైన్‌ మరమ్మతుకు గురవ్వడంతో మునిసిపాలిటీతోపాటు మండలంలోని 17 గ్రామాలకు 3 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది పైపులైన్‌ మరమ్మతు పనులు ఆదివారం నాటికి పూర్తి చేశారు. సోమవారం నుంచి అన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మునిసిపాలిటీకి తాగునీటి సరఫరా చేసే యర్రవరంలోని 200 వేల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన సంప్‌ను మునిసిపల్‌ ఏఈ గణపతిరావు పర్యవేక్షణలో సిబ్బందిచే పరిశుభ్రం చేశారు. సోమవారం నుంచి తాగునీటి సరఫరా జరుగుతుందని ఏఈ గణపతిరావు తెలిపారు.

Updated Date - Nov 11 , 2024 | 12:11 AM