మళ్లీ పెరిగిన చలి
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:19 PM
మన్యంలో చలి తీవ్రత, పొగమంచు తగ్గడం లేదు. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది. గురువారం జి.మాడుగులలో 7.4, జీకేవీధిలో 9.3, చింతపల్లిలో 12.5, అరకులోయలో 12.7, పాడేరులో 12.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి.
జి.మాడుగులలో 7.4, జీకేవీఽధిలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
పాడేరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత, పొగమంచు తగ్గడం లేదు. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది. గురువారం జి.మాడుగులలో 7.4, జీకేవీధిలో 9.3, చింతపల్లిలో 12.5, అరకులోయలో 12.7, పాడేరులో 12.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. మూడు రోజులుగా ఏజెన్సీ వ్యాప్తంగా ఉదయం వేళల్లో పొగ మంచు దట్టంగానే కమ్ముకుంటున్నది. దీంతో ఎదురుగా వున్న వ్యక్తులు సైతం కనిపించని విధంగా ఉండడంతో వాహనాలు హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక మోస్తరుగా ఎండ ప్రభావం ఉండగా, మిగిలిన సమయంలో చలి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో చలి మంటలు వేసుకుంటూ, ఉన్ని దుస్తులు ధరిస్తూ మన్యం వాసులు చలి నుంచి రక్షణ పొందుతున్నారు.
జీకేవీధి, చింతపల్లిలో..
చింతపల్లి: మన్యంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం జీకే వీధిలో 9.3, చింతపల్లిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం చింతపల్లిలో 16 డిగ్రీలు నమోదుకాగా, ఒక్కరోజులోనే 3.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో ఒక్కసారిగా చలి ఉధృతి పెరిగింది. చలితో పాటు మంచు అధికంగా కురుస్తున్నది. ఉదయం పదిన్నర గంటల వరకు లంబసింగి, తాజంగి, చింతపల్లి, జీకే వీధి, ఆర్‌వీ నగర్ ప్రాంతాల్లో మంచు వీడడం లేదు. ఉదయం వేళల్లో స్థానిక ప్రజలు మంచు, చలిలోనే వారి దినచర్యను ప్రారంభిస్తున్నారు. చలి పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు మరింతగా ఇబ్బంది పడుతున్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:19 PM