ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబు సభకు చకచకా ఏర్పాట్లు

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:15 PM

అరకుకు సమీపంలో జైపూర్‌ జంక్షన్‌ వద్ద ఈ నెల 20న నిర్వహించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఏజెన్సీకి వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న పాడేరు ఏఎస్‌పీ ధీరజ్‌

శరవేగంగా పనులు

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు

అరకులోయ, జనవరి 18: అరకుకు సమీపంలో జైపూర్‌ జంక్షన్‌ వద్ద ఈ నెల 20న నిర్వహించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఏజెన్సీకి వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం సీఐ రుద్రశేఖర్‌, స్థానిక ఎస్‌ఐలు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం పాడేరు ఏఎస్‌పీ కె.ధీరజ్‌ కూడా పరిశీలన జరిపారు. సభ ఏర్పాట్లు, తదితర వివరాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అరకు అసెంబ్లీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావును అడిగి తెలుసుకున్నారు. కాగా సభా వేదిక, బారికేడ్లు, హెలీప్యాడ్‌ పనులు, పార్కింగ్‌కు స్థలం తదితర ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దువ్వారపు రామారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, అరకు పార్లమెంట్‌ ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్‌, అరకు అసెంబ్లీ ఇన్‌చార్జి దొన్నుదొర పనులను పర్యవేక్షించారు. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పార్టీ నాయకులు పనుల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - Jan 18 , 2024 | 11:15 PM

Advertising
Advertising