ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GVL Narasimha Rao: పీవీ నరసింహారావు చరిత్రను అందరికీ తెలిసేలా చేయాలి

ABN, Publish Date - Mar 03 , 2024 | 06:57 PM

భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు చరిత్రను అందరికీ తెలిసేలా చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు( BJP MP GVL Narasimha Rao) అన్నారు. పీవీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన సందర్భంగా ‘‘నాలుగు మంచి మాటలు’’ పేరుతో బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.

విశాఖపట్నం: భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు చరిత్రను అందరికీ తెలిసేలా చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(
BJP MP GVL Narasimha Rao) అన్నారు. పీవీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన సందర్భంగా ‘‘నాలుగు మంచి మాటలు’’ పేరుతో బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభకు పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి సోమయాజులు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ... పీవీ నరసింహారావు లాంటి మహోన్నతమైన వ్యక్తి సేవలను గుర్తించి, భారతరత్న ఇవ్వటం గర్వించదగ్గ అంశమని తెలిపారు. అలాంటి చరిత్ర అందరికీ తెలిసేలా చేయాలని సూచించారు. నేషనల్ మెమోరియల్ తెలుగు రాష్ట్రాల్లో నిర్మించాలని.. వారి జీవిత చరిత్రపై రీసెర్చ్ జరిగేలా చూడాలని జీవీఎల్ నరసింహారావు అన్నారు. అనంతరం సోమయాజులు మాట్లాడుతూ... ప్రపంచంలో ఆర్థిక సంస్కరణలు, న్యూక్లియర్, ప్రపంచాన్ని శాసిస్తుందని చెప్పారన్నారు. పీవీకి ఎప్పుడో భారతరత్న రావాలని చెప్పారు. ఆలస్యంగానైనా ఆయన సేవలను గుర్తించినందుకు ప్రధాని మోదీకి సోమయాజులు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2024 | 06:58 PM

Advertising
Advertising