ఉజ్బెకిస్తాన్‌లో గాజువాక వాసి మృతి
ABN, Publish Date - Nov 07 , 2024 | 01:27 AM
ఉపాధి కోసం ఉజ్బెకిస్తాన్ వెళ్లిన గాజువాక వాసి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇందుకు సంబంధించి ఆయన కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధి యాతపాలెం ప్రాంతానికి చెందిన కొప్పనాతి ఆనంద్ (43) వెల్డర్. ఉపాధి నిమిత్తం గాజువాక ఆటోనగర్‌లో గల ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన ఉజ్బెకిస్తాన్ వెళ్లారు. ఈ నెల రెండో తేదీ రాత్రి పది గంటలకు ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు
గాజువాక, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం ఉజ్బెకిస్తాన్ వెళ్లిన గాజువాక వాసి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇందుకు సంబంధించి ఆయన కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధి యాతపాలెం ప్రాంతానికి చెందిన కొప్పనాతి ఆనంద్ (43) వెల్డర్. ఉపాధి నిమిత్తం గాజువాక ఆటోనగర్‌లో గల ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన ఉజ్బెకిస్తాన్ వెళ్లారు. ఈ నెల రెండో తేదీ రాత్రి పది గంటలకు ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరుసటిరోజు (నవంబరు 3న) ఉదయం అక్కడ నుంచి ఒకరు ఆనంద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అతను చనిపోయినట్టు చెప్పారు. దీంతో వారు అక్కడ ఆనంద్ పనిచేస్తున్న సంస్థ అధికారులను ఫోన్‌లో సంప్రతించేందుకు యత్నించగా స్పందించలేదు. గాజువాకలో గల ఏజెన్సీ ప్రతినిధులు కూడా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆనంద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆనంద్ ఎలా చనిపోయాడో తెలియడం లేదని, తమకు పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు బుధవారం న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యూపోర్టు సీఐ దాలిబాబును సంప్రతించగా సంబంధిత ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడామన్నారు. మృతదేహం రహదారిపై ఉందని, రోడ్డు ప్రమాదం అయి ఉండవచ్చునని సమాచారం ఉందన్నారు. అక్కడ పోలీసుల దర్యాప్తులో వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆనంద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Updated Date - Nov 07 , 2024 | 01:28 AM