ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఠాగూర్‌’ ఫార్మాపై కేసు నమోదు

ABN, Publish Date - Dec 05 , 2024 | 01:01 AM

ఫార్మాసిటీలోని ఠాగూర్‌ ఫార్మా లేబొరేటరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు అనకాపల్లి జిల్లా పరవాడ సీఐ జి.మల్లికార్జునరావు తెలిపారు. ఫ్యాక్టరీలో వారం కిందట విష వాయువు లీకవ్వడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే.

పరవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఫార్మాసిటీలోని ఠాగూర్‌ ఫార్మా లేబొరేటరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు అనకాపల్లి జిల్లా పరవాడ సీఐ జి.మల్లికార్జునరావు తెలిపారు. ఫ్యాక్టరీలో వారం కిందట విష వాయువు లీకవ్వడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తేల్చారు. దీనిని తీవ్రంగా పరిగణించి వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిర్లక్ష్యం, మానవ ప్రాణాలకు హాని కలిగించడం, ప్రమాదాన్ని అధికారులకు తెలియకుండా దాచిపెట్టడం, తదితర అభియోగాలపై కేసు నమోదుచేశారు. భారతీయ న్యాయ సహిత సెక్షన్‌ 106 (1), 125 (ఎ), 125 (బి), 239, 286 రెడ్‌విత్‌ 3 (5) కింద కేసు నమోదుచేసినట్టు సీఐ వెల్లడించారు. ఇదిలావుంటే అస్వస్థతకు గురైన ఉద్యోగుల్లో ఇంకా 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారిని రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశం ఉందన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 01:01 AM