ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మండల సమావేశంలో కోడ్‌ ఉల్లంఘన

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:17 AM

ఎన్నికల కోడ్‌ ఉన్నందున అభివృద్ధి పనులకు సంబం ధించి సమావేశంలో సభ్యు లు చర్చించ వద్దని అధికారు లు తెలిపినా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గొడవకు దిగిన సంఘటన మండలంలో చోటు చేసికొంది.

అధికారుల సాక్షిగా సభ్యుల ఘర్షణ

అధికారుల సాక్షిగా సభ్యుల ఘర్షణ

సమావేశానికి భార్యల స్థానంలో భర్తలు హాజరు

నిమ్మనపల్లి, మార్చి 27: ఎన్నికల కోడ్‌ ఉన్నందున అభివృద్ధి పనులకు సంబం ధించి సమావేశంలో సభ్యు లు చర్చించ వద్దని అధికారు లు తెలిపినా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గొడవకు దిగిన సంఘటన మండలంలో చోటు చేసికొంది. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీవో శాలెట్‌ నిర్వహించారు. సభ్యల వద్ద నుంచి కేవలం సం తకాలు తీసుకొని సభ నిర్వహించి సమస్యలపై మాట్లాడక పోవడంపై రాచవేటివారిపల్లి వైసీపీ సర్పంచ సుబ్రయణ్యం అధికారులను నిలదీశా రు. ఎంపీటీసీలు రాకుండానే సమావేశాలు నిర్వహిస్తూ మండల గ్రాం టు కూడా ఎంపీటీసీలకు కేటాయించడంపై ఎంపీపీ నరసింహులను నిలదీశారు. దీంతో పోడియం వద్దకు వెళ్లి ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది, సామకోటవారిపల్లి సర్పంచ మహదేవరెడ్డి మాట్లాడుతూ కేవలం కొంత మంది వైసీపీ నాయకులు స్వార్థరాజయాలను చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారిని దీని ద్వారా పంచాయతీల అభివృద్ధి సాధ్యంకాలేదన్నారు. ఇది ఇలా వుండగా సర్పంచులుగా భార్యల స్థానంలో భర్తలు సమావేశానికి రావడం చర్చ నీయాశంగా మారింది. జడ్పీటీసీ ప్రమీలమ్మకు బదులుగా ఆమె భర్త వెంకటరమణారెడ్డి సమావేశాని హాజరయ్యారు. ఇంత జరుగుతున్నా మండల అధికారులు తహసీల్దార్‌ బాలాజిరాజు, ఎంపీడీవో శాలెట్‌లు మాత్రం ఏమి తెలియనట్లు మిన్నకుండి పోయారు. మంగళవారం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి షాజహనబాషా చిన్నసాటి సమావేశం జరగనీ యకుండా ఎంపీడీవో శాలెట్‌ అక్కడే కూర్చోని సమావేశం అడ్డుకోవడం తో దీన్ని బట్టి చూస్తే అధికారులు వైసీపీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తు న్నారోనని పలువురు చర్చికోవడం విశేషం.

Updated Date - Mar 28 , 2024 | 12:17 AM

Advertising
Advertising