వైసీపీకి వాసిరెడ్డి పద్మ గుడ్ బై
ABN, Publish Date - Oct 24 , 2024 | 03:51 AM
వైసీపీలో మరో వికెట్ పడింది. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ
అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీలో మరో వికెట్ పడింది. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి, ప్రజలకు, పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఆయన మోసం చేశారని అన్నారు. పేద ప్రజల సంక్షేమం పేరిట జగన్ లూటీ చేశారని, మద్యం పేరుతో భారీగా దోపిడీ చేశారని ఆరోపించారు. ప్రజాతీర్పు వెలువడ్డాక కూడా ఆయనలో మార్పు రాలేదని, ఆత్మవిమర్శ చేసుకోలేదన్నారు. గుడ్‌బుక్ పేరిట పార్టీ నేతలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తననూ మోసం చేశారని, మభ్యపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి, పేదలకు అన్యాయం జరిగిందన్నారు. సామాన్యులపై అధిక ధరల భారం వేశారని, ప్రతి సందర్భంలో ప్రజలను మోసం చేశారన్నారు. మహిళల విషయంలో జగన్ పాలనలో రోజుకో వికృత సంఘటన జరిగిందన్నారు. ఆ రోజు బాధితుల ఇళ్లకు వెళ్లి ఆయన ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రత కోసం జగన్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసుల పనితీరు బాగుందన్నారు. ప్రజాతీర్పు తర్వాత కూడా అన్యాయాన్ని భరించాల్సిన పరిస్థితి తనకు లేదన్నారు.
Updated Date - Oct 24 , 2024 | 03:51 AM