ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్లు వేస్తుండగానే పక్కా తనిఖీ

ABN, Publish Date - Oct 27 , 2024 | 04:00 AM

రాష్ట్రవ్యాప్తంగా 30 వేల సిమెంట్‌ రోడ్లను మంజూరుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి నిర్మాణాల విషయంలో ఇప్పటికే దూకుడు పెంచింది.

అన్ని జిల్లాల్లో మొదలైన నాణ్యతా పరిశీలన

సిమెంట్‌రోడ్ల నిర్మాణంలో ఇప్పటికే దూకుడు

క్వాలిటీపైనా దృష్టి పెట్టిన కూటమి సర్కారు

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 30 వేల సిమెంట్‌ రోడ్లను మంజూరుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి నిర్మాణాల విషయంలో ఇప్పటికే దూకుడు పెంచింది. కొత్తగా వేస్తున్న సిమెంట్‌రోడ్లు నాణ్యతతో నిర్మించాలని, 30 ఏళ్లు మన్నికగా రోడ్లు ఉండేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అవి నాణ్యతగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని భావించారు. ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు రోడ్ల తనిఖీలు చేపట్టారు. రోడ్డు పూర్తి అయిన తర్వాత క్వాలిటీ తనిఖీలు చేయడం కంటే రోడ్డు నిర్మాణం సమయంలోనే తనిఖీలు చేపడితే రోడ్లను నాణ్యతతో నిర్మించే అవకాశముంటుందని భావిస్తున్నారు. సిమెంట్‌రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం ఇంజనీర్లను వేధించిన విషయం విదితమే. టీడీపీ హయాంలో సిమెంట్‌రోడ్ల నిర్మాణం చేసినప్పుడు ఆ పనులన్నింటికీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఆపేసింది. ఆ బిల్లులు చెల్లించాలని కోర్టుకెళ్లిన కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టేందుకు విజిలెన్స్‌ తనిఖీలకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్‌ అధికారులు అప్పట్లో పలు సిమెంట్‌రోడ్లను రద్దు చేయడం, తిరస్కరించడం, ఇంజనీర్లపై చర్యలు తీసుకునేలా సిఫారసులు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్లు బెంబేలెత్తిపోయారు. ఈ నేపథ్యంలో ఇంజనీర్లు తిరిగి సిమెంట్‌రోడ్ల నిర్మాణం అనగానే వెనుకడుగు వేసే పరిస్థితి. ముందుగానే క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు, ప్రాజెక్టు డైరక్టర్లు తనిఖీలు చేపడుతుండటాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. దీనివల్ల తమ పని సులువైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు శనివారం సిమెంట్‌రోడ్లను తనిఖీ చేశారు. ప్రతి జిల్లాలో మూడు క్వాలిటీ కంట్రోల్‌ టీంలున్నాయి. సాధారణంగా సిమెంట్‌రోడ్ల నిర్మాణం తర్వాత 21 రోజుల క్యూరింగ్‌ పీరియడ్‌ తర్వాతనే బిల్లులు చేసేందుకు ఇంజనీర్లు సిద్ధమవుతారు. అయితే ఆ తర్వాత క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు కూడా తనిఖీ చేసి సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ముందే తనిఖీలు చేస్తే పనులు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు క్వాలిటీ కంట్రోల్‌ అధికారులకు ఇబ్బందులుండవు.

Updated Date - Oct 27 , 2024 | 04:00 AM