ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అపార్‌ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు..

ABN, Publish Date - Nov 28 , 2024 | 11:37 PM

విద్యార్థులకు అపార్‌ గుర్తింపు ఇచ్చే దిశగా ప్రత్యేక ఆధార్‌ సెంటర్లను ఏర్పాటు చేసి నా ఇబ్బందులు తప్పడంలేదు.

వాల్మీకిపురంలో ఆధార్‌ అప్‌డేట్‌ కొరకు పిల్లలతో కలిసి ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు

వాల్మీకిపురం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అపార్‌ గుర్తింపు ఇచ్చే దిశగా ప్రత్యేక ఆధార్‌ సెంటర్లను ఏర్పాటు చేసి నా ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా ప్రత్యేక ఆధార్‌ కేంద్రాన్ని నిర్వహించారు. అయితే రెండు రోజుల పాటుగా వందలకొద్దీ విద్యార్థులు కేంద్రానికి చేరుకున్నా కనీస పదుల సంఖ్యలో విద్యార్థుల అపార్‌ సమస్యను పరిష్కారం కాలేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపో తున్నారు. గురువారం ఉదయం నుంచి పిల్లలతో తల్లిదండ్రులు ఆధార్‌ కేంద్రం వద్ద బారులు తీరగా సర్వర్‌ సక్రమంగా పనిచే యకపోవడం కనీసం పది మంది విద్యార్థులకైనా ఆధార్‌ సమస్య లను పరిష్కరించలేకపోయారు. దీనికి తోడు విద్యుత అంతరా యంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని పలువురు వాపోయారు. కేవలం రెండు రోజుల పాటు ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సరికాదంటున్నారు. అపార్‌ పరిష్కారం కాని పిల్లల తల్లిదండ్రులు ఆధార్‌ కోసం మళ్లీ తామెక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకుని ఇదే పాఠశాలలో మరో రెండు, మూడు రోజుల పాటు ఆధార్‌ కేంద్రాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:37 PM