ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీక్స్‌కు చేరిన ఫోన్‌ పిచ్చి!

ABN, Publish Date - Oct 27 , 2024 | 04:44 AM

ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌, ఫేస్‌బుక్‌ స్టోరీలు... ఇవి కావని, రకరకాల గేమ్స్‌! మొబైల్‌ పట్టుకుంటే... వదిలే ప్రసక్తే లేదు. నిమిషాలు, గంటలూ కరిగి పోవాల్సిందే!

మానసిక వ్యాధిలా మారుతున్న మొబైల్‌ వ్యసనం

మొబైల్‌ పట్టుకుంటే.. వదలరు!

గేమ్స్‌, రీల్స్‌, షార్ట్స్‌లో గంటలకొద్దీ ‘బిజీ’

అన్ని వయసుల వారూ మొబైల్‌కు బానిసలే

చివరకు బాధితులుగా మారి ఆస్పత్రులకు క్యూ

కడప ప్రభుత్వ మానసిక వ్యాఽధుల ఆసుపత్రికి

ప్రతినెలా వందమందికిపైగా బాధితులు

(కడప/విశాఖపట్నం/గుంటూరు - ఆంధ్రజ్యోతి)

న్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌, ఫేస్‌బుక్‌ స్టోరీలు... ఇవి కావని, రకరకాల గేమ్స్‌! మొబైల్‌ పట్టుకుంటే... వదిలే ప్రసక్తే లేదు. నిమిషాలు, గంటలూ కరిగి పోవాల్సిందే! చిన్న, పెద్దా తేడా లేదు! ఇప్పటిదాకా జూదం, మద్యం, డ్రగ్స్‌కు అలవాటుపడి చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లేవారిని చూశాం. ఇప్పుడు ‘మొబైల్‌ అడిక్షన్‌’ వదిలించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ‘మొబైల్‌ వల’లో చిక్కుకుపోతున్నారు. చివరికి ఇదో మానసిక సమస్యగా మారిపోతోంది. కడపలాంటి చిన్నపాటి నగరంలోనే ప్రభుత్వ మానసిక వైద్యశాలకు ప్రతినెలా సుమారు వందమంది మొబైల్‌ బెడద వదిలించుకునేందుకు వైద్యులను సంప్రదిస్తున్నారు. వీరిలో కొందరిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. ఇంకా ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర ప్రాంతాలలో చికిత్స పొందుతున్న వారు కూడా ఎందరో! మొబైల్‌ బాధితులో పదేళ్ల వయసు పిల్లలూ ఉండటం గమనార్హం. స్మార్ట్‌ఫోన్లు, తక్కువ ధరకే డాటా! యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌... వంటి సోషల్‌ మీడియా వేదికలు! వీటికి అదనంగా రకరకాల గేమ్స్‌! ఫోన్‌ తెరకు కళ్లను అతికించేయడమే! ఇంట్లో కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, లిఫ్టు ఎక్కినా, రోడ్డుమీద నడుస్తున్నా... ఫోన్‌పైనే ధ్యాస! చిన్నపిల్లలు గేమ్స్‌ ఆడుతుండగా... టీనేజ్‌, మధ్య వయస్కులు సోషల్‌ మీడియాలో మునిగిపోతున్నారు. మరికొందరు యూట్యూబ్‌, ఓటీటీ సినిమాలు చూస్తూ గడిపేస్తున్నారు. కొంత మందికి అవసరం లేకపోయినా సరే మొబైల్‌ను చూడకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఫీలవుతున్నారు. ఆఫీసుల్లోనూ సగం మంది గంటకోసారైనా సోషల్‌ మీడియాలోకి తొంగిచూస్తున్నారు. డైలీ 1, 2, 3 జీబీ ప్లాన్‌లు... ఇళ్లూ, కార్యాలయాల్లో వైఫైలతో నిత్యం ‘నెట్‌’తో కనెక్ట్‌ అయ్యే ఉంటున్నారు. గంటల కొద్దీ ఫోన్‌ వదలకపోవడంతో కంటిచూపు దెబ్బతింటోంది. మెడ నొప్పి, ఇతర శారీరక సమస్యలతోపాటు... మానసిక ఆరోగ్యమూ దెబ్బతింటోంది.

స్వీయ నియంత్రణే మందు..

మొబైల్‌ వినియోగం విషయంలో స్వీయ నియంత్రణ అవసరమని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఇంత సమయం మాత్రమే సోషల్‌ మీడియా ఫాలో కావాలనే నిబంధన పెట్టుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని సోషల్‌ మీడియా యాప్స్‌లో ‘టైమ్‌ కంట్రోల్‌’ కూడా ఉంటుంది. 15 నిమిషాలు లేదా అరగంట కాగానే... ‘మీ పరిమితి రీచ్‌ అయ్యారు’ అనే అలర్ట్‌ వస్తుంది. ఇక... పిల్లలకు అరగంటకు మించి ఫోన్‌ ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అల్లరి మాన్పించేందుకు, ఆహారం పెట్టేందుకు ఫోన్‌ అలవాటు చేయొద్దని... వారిని ఇది ఫోన్‌కు ‘అడిక్ట్‌’ చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇలా బయటపడొచ్చు...

కౌన్సెలింగ్‌, థెరపీల ద్వారా ఫోన్‌ అడిక్షన్‌ను దూ రం చేయవచ్చు. వీలైనంత వరకు ఫోన్‌కు దూరంగా ఉండే లా చేయడం ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు.. యోగా, మెడిటేషన్‌, మ్యూజిక్‌ వినడం వంటి యాక్టివిటీస్‌ ద్వారా ఫోన్‌ అడిక్షన్‌ నుంచి నుంచి బయటపడవచ్చు.

- డాక్టర్‌ పూజిత, సైకాలిజస్టు, విశాఖపట్నం


ఇవీ లక్షణాలు..

పెద్దల్లో అయితే... పనిపై దృష్టిసారించలేకపోవడం, ఎదుటి వారి జీవితాలతో పోల్చుకోవడం!

విద్యార్థులు రూమ్‌కు పరిమితమై ఉండడం, ఆహారం, నిద్రలో తేడా రావడం, ఇతరులతో కలవకపోవడం.

కడపకు చెందిన ఆ కుర్రాడి వయసు 11 సంవత్సరాలు. కొవిడ్‌ సమయంలో సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం అలవాటైంది. అది వ్యసనంగా మారింది. సరిగా అన్నం తినకపోవడం, స్కూలుకు పొమ్మంటే తిరగబడటం, నిద్రలో కలవరింతలు, చేతులు నొక్కుకోవడం, ఉలిక్కిపడి లేవడం వంటి సమస్యలు మొదలయ్యాయి. చేతిలోంచి ఫోన్‌ తీసుకుంటే గొడవపడే స్థాయికి వచ్చాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో.. పిల్లాడిపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయారు. పరిస్థితి విషమిస్తుండడంతో చికిత్స చేయించారు. సైకోథెరపీ, బిహేవియర్‌ థెరపీతో ఆ పిల్లాడు దారికి వచ్చాడు.

విశాఖపట్నంలో నగరంలో ప్రతినెలా 200 మందికిపైగా ‘ఫోన్‌ బాధితులు’ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను సంప్రదిస్తున్నారు. వీరి స్ర్కీన్‌టైమ్‌ రోజుకు పదిగంటలకుపైగానే అని చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌కు అలవాటుపడుతున్న 29-40ఏళ్లలోపు వారిలో 70ుమంది మహిళలే. యూట్యూబ్‌ చానెల్స్‌లో వస్ర్తాలు, వంటలు, ఆభరణాలు, హోమ్‌టూర్‌ వీడియోలు చూస్తున్నారు. ఇతరుల సామాజిక, ఆర్థిక స్థితితో పోల్చుకుంటూ కుటుంబంలో అలజడికి కారణమవుతున్నారు. ఈ తరహా గొడవలతో మానసిక నిపుణులు వద్దకు వస్తున్న దంపతులు సంఖ్య పెరుగుతోంది.

స్మార్ట్‌ఫోన్‌ అడిక్షన్‌ బాధితుల్లో

60@ 8-18 వయసువారే

30@ 29-40 వయసువారే

కడప జిల్లా బద్వేలు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. వీరిది వ్యవసాయ కుటుంబం. రోజూ ఆరేడు గంటలు ఫోన్‌లోనే! చదువుకోమ్మా అంటే వినదు. ఫోన్‌ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు. ‘చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది’ అని మంచి మాటలు చెబితే... ‘డబ్బు సంపాదన కోసం ఉద్యోగమే చేయాల్సిన అవసరం లేదు. రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌, పోస్టుల ద్వారా కూడా డబ్బు సంపాదించుకోవ చ్చు’ అంటూ ఎదురు సమాధానాలు! పరిస్థితి చేయి దాటి పోవడంతో కుటుంబ సభ్యులు ఆ బాలికను కడప ఆసుపత్రికి తీసుకువచ్చారు. కౌన్సెలింగ్‌, ఇతర చికిత్సలతో ఆ పాప ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చింది.


అతిగా వినియోగిస్తే అనర్థమే

ఐదేళ్ల పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు... వయసుతో సంబంధంలేకుండా అనేక మంది మొబైల్‌ ఫోన్‌కు అడిక్ట్‌ అవుతున్నారు. ఇలా మొబైల్‌ ఫోన్‌కు బానిసలైన వారు సరిగా చదవకపోవడం, చిన్న విషయాలకే చికాకు పడటం, నిద్రపోకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలా అడిక్ట్‌ అయినవారికి కడప ఆసుపత్రిలో కౌన్సెలింగ్‌ ఇస్తు న్నాం. మరీ ముదిరిపోతే వారం పదిరోజులు మెడిసిన్‌తోపాటు సైకో బిహేవియర్‌ థెరపీ తో చికిత్స ఇస్తున్నాం. ట్రీట్‌మెంట్‌ సమయంలో వారి ఆలోచనలను ఇతర అంశాలపైకి మళ్లిస్తాం.

- డాక్టర్‌ వంశీకృష్ణ, అసోసియేట్‌

ప్రొఫెసర్‌, ప్రభుత్వ మానసిక వ్యాధుల ఆసుపత్రి, కడప

ఈ-ఎడిక్షన్‌... మానసిక వ్యాధే

సెల్‌ఫోన్‌ను అతిగా వాడుతూ దానికి బానిసగా మారడాన్ని వైద్య శాస్త్రం ప్రకారం మానసిక వ్యాధిగానే పరిగణిస్తారు. సెల్‌ఫోన్‌, ఇతర సామాజిక మాధ్యమాలతో అతిగా గడపడాన్ని శాస్ర్తీయంగా ఈ-ఎడిక్షన్‌ అని పిలుస్తారు. మానసిక వ్యాధుల విభాగంలో ఈ జబ్బును బిహేవియల్‌ ఎడిక్షన్‌ లో చేర్చారు. ఆరేళ్ల కిందట వరకు ఈ-ఎడిక్షన్‌ను మానసిక జబ్బుగా పరిగణించాలా? లేదా? అనే అంశంపై మీమాంశ ఉండేది. ఇటీవల ఇంటర్నేషనల్‌ సైకియాట్రిస్ట్‌ సొసైటీ, ఈ-ఎడిక్షన్‌ను బిహేవియల్‌ ఎడిక్షన్‌ కేటగిరిలో చేర్చింది. రోజుకు రెండు గంటలకు పైగా సెల్‌ఫోన్‌ వినియోగిస్తుంటే అది ఎడిక్షన్‌ కిందకు వస్తుంది. 20 శాతం విద్యార్థులు ఎడిక్షన్‌ బాధితులే. కరోనా సమయం నుంచి సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, వాట్సప్‌ తదితర వినియోగం భారీగా పెరిగినట్లు పరిశీలకులు చెబుతున్నారు.

- (గుంటూరు మెడికల్‌)

సెల్‌ఫోన్‌ అతి వినియోగాన్ని తగ్గించేందుకు ఉదయమే వ్యాయామం, వాకింగ్‌, యోగా వంటివి చేయాలి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఎక్కువగా గడపాలి.

- డాక్టర్‌ కోట సురేశ్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ సైకియాట్రిస్ట్‌ సొసైటీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కాటూరి వైద్య కళాశాల, జనరల్‌ ఆసుపత్రి మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి

Updated Date - Oct 27 , 2024 | 04:44 AM