ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తేడా తెలియనంతగా కల్తీ చేశారు!

ABN, Publish Date - Sep 21 , 2024 | 03:50 AM

శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో పంది, గొడ్డు వంటి జంతువుల కొవ్వు కలిసినట్టు నేషనల్‌ డెయిరీ డెవలప్మెంట్‌ బోర్డ్‌(ఎన్‌డీడీబీ) నివేదికతో పాటు పలు పరీక్షల్లో నిర్ధారణ అయిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

నెయ్యా-నూనా.. అన్నది గుర్తించేందుకు పలు చోట్ల అనేక పరీక్షలు చేయించాం

కల్తీ జరిగినట్టు ఎన్‌డీడీబీ నిర్ధారించింది

టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి

తిరుమల, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో పంది, గొడ్డు వంటి జంతువుల కొవ్వు కలిసినట్టు నేషనల్‌ డెయిరీ డెవలప్మెంట్‌ బోర్డ్‌(ఎన్‌డీడీబీ) నివేదికతో పాటు పలు పరీక్షల్లో నిర్ధారణ అయిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూల్లో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం చెప్పారన్నారు. ఈ క్రమంలో తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత పలువురు నిపుణులతో ప్రసాదాల నాణ్య తపై చర్చించినట్టు తెలి పారు. నాణ్యమైన నెయ్యి లేకపోవడంతోనే లడ్డూల రుచి తగ్గిందనే విషయం తెలిసిందన్నారు. అయితే, టెండర్ల ద్వారా వచ్చే నెయ్యిని వందశాతం పరీక్షించే ల్యాబ్‌ తిరుమలలో లేదన్నారు. రూ.75 లక్షలు ఖర్చు పెడితే ఆధునిక ల్యాబ్‌ను సిద్ధం చేసుకోవచ్చని, కానీ.. ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరగలేదన్నారు. వంద శా తం పరీక్షలు చేసే సామర్థ్యం లేకపోవడంతో.. టెండరుదారులు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని కల్తీ నెయ్యిని పంపుతున్నారని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న 5 సంస్థల్లో దుండిగల్‌కు చెంది న ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ పంపుతున్న నెయ్యిలోనే నాణ్యత లేదన్నారు. ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంప గా.. నెయ్యి కల్తీ అయినట్టు తేలిందని చెప్పారు. దీంతో ఏఆర్‌ సంస్థను బ్లాక్‌లి్‌స్టలో పెట్టామన్నా రు. ‘‘అది నెయ్యా లేదా నూనా అని తెలియనంతగా ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ సంస్థ సరఫరా చేసిం ది. త్వరలో ఈ సంస్థపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ కల్తీ విషయంలో తొలిసారి మీడియాతో మాట్లాడినప్పుడు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు స్పష్టత రాలేదు. తర్వాత అధికారులతో మాట్లాడి నిర్ధారించుకున్నాం. ఎ లాంటి నెయ్యి కొనుగోలు చేయాలనే అంశంపై ఇప్పటికే ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. డిసెంబరు నాటికి అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాం. ‘నందిని’ నెయ్యిని తిరిగి కొనుగోలు చేస్తున్నాం’’ అని ఈవో శ్యామలరావు వివరించారు.

నాణ్యతను నిర్ధారించే వరకు తిరుమల శ్రీవారికి ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారపదార్థాలతో నైవేద్యాలు సమర్పిస్తున్నామని, అయితే వీటి నాణ్యత విషయంలోనూ కొన్ని అనుమానాలు ఉన్నాయని ఈవో శ్యామలరావు తెలిపారు. దీంతో ఈ ప్రసాదాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు చెప్పారు. వీటి నాణ్యత పరిశీలినపై ఓ కమిటీని నియమించామన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 03:51 AM