ఉండలేక.. వెళ్లలేక!
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:24 AM
- మెళియాపుట్టి మండలం దాసుపురం గ్రామానికి చెందిన సవర మల్లీశ్వరి భర్త నాలుగేళ్ల కిందట కన్నుమూశాడు. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలసి ఎప్పుడు కూలుతుందో తెలియని పాత ఇంటిలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది. వీరిది ఆఫ్‌షోర్ నిర్వాసిత గ్రామం.
- మెళియాపుట్టి మండలం దాసుపురం గ్రామానికి చెందిన సవర మల్లీశ్వరి భర్త నాలుగేళ్ల కిందట కన్నుమూశాడు. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలసి ఎప్పుడు కూలుతుందో తెలియని పాత ఇంటిలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది. వీరిది ఆఫ్‌షోర్ నిర్వాసిత గ్రామం. కానీ ఈ కుటుంబానికి పరిహారం అందలేదు. కొత్త ఇంటి నిర్మాణానికి ప్యాకేజీ రాకపోవటంతో బీటలు వారిన ఇంటిలో నివాసం ఉంటున్నారు. ‘సర్వే సమయంలో మేం గ్రామంలో లేకపోవ డంతో పరిహారం మంజూరు కాలేదని అధికారులు చెబుతు న్నారు. ఎన్నిసార్లు తిరుగుతున్నా ప్రయోజనం లేద’ని మల్లీశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ అదే గ్రామానికి చెందిన సవర సోంబారమ్మకు ముగ్గురు కూమా రులు ఉన్నారు. వీరిలో ఒక్కరికి మాత్రమే ప్యాకేజీ రావడంతో మిగిలిన వారు పాత ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. ఆ ఇల్లు ఎప్పుడు కూలుతోందోనని ఆందో ళనతో గడుపుతున్నారు. మిగిలిన వారికీ ప్రయోజనాలు కల్పించాలని వేడుకుంటున్నారు.
- అదే గ్రామానికే చెందిన సవర దేవికమ్మకు ప్యాకేజీ వచ్చిన ప్పటికీ పునరావాస కాలనీలో ఇల్లు మం జూరు చేయలేదు. ఆమె కూడా పాత ఇంటిలోనే నివాసం ఉంటు న్నానని చెబుతున్నారు. ఆ ఇంటి లో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
..ఇవీ ఆఫ్‌షోర్ నిర్వాసిత గ్రామాల్లోని కుటుంబాల కష్టాలకు మచ్చుతునకలు.
మెళియాపుట్టి, జనవరి 17
మహేంద్ర తనయ నదిపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులకు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టారు. దీని కారణంగా నిర్వాసితులైన వారిలో కొంతమందికి ప్రభు త్వం నుంచి పరిహారం అందగా...మరికొందరికి రకరకాల సర్వేల పేరుతో ఇప్పటి వరకూ ఎటు వంటి సాయమూ అందలేదు. దాసుపురం, చీపురుపల్లి గ్రామాలకు సంబంధించి 130 మంది నిర్వాసితులకు ప్యాకేజీ రాలేదు. వీరం తా పాత ఇళ్లలో ఉండలేక... కొత్త ఇళ్లు నిర్మించ లేక... భవిష్యత్తు ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వీరిలో అనేక మం దికి చెందిన ఇళ్లు కూలటానికి సిద్ధంగా ఉన్నా యి. ప్యాకేజీ వచ్చిన వారిలో కొందరు గ్రామా లు వదిలి పునరావాస గ్రామాలకు వెళ్లారు. మిగిలిన 130 మంది మాత్రం ఏ సాయమూ అందక పాత ఇళ్లలోనే నెట్టుకొస్తున్నారు.
జగనన్నా.. హమీ ఏమైంది?
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షం లో ఉన్న సమయంలో ఆఫ్‌షోర్ నిర్వాసితు లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘2013 ప్యాకేజీ’తో పాటు యూత్ ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చారు. యూత్ ప్యాకేజీ మాట అటుంచితే... కనీసం ఉన్న కుటుంబాలకు కూడా ప్రయోజనం కనిపించలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందని పరిహారం...
చీపురుపల్లి, దాసుపురం నిర్వాసిత గ్రామాల కు జీవో నెంబర్ 460 ప్రకారం యూత్ ప్యాకే జీ ఇవ్వవలసి ఉంది. దీనితో పాటు ప్రభుత్వ ప్యాకేజీలో ఇంటి స్థలం పొందిన వారికి రూ. 9.91 లక్షలు... స్థలం వద్దనుకున్న వారికి రూ. 11.35 లక్షలు ఇచ్చారు. డీ పట్టా భూములకు, దేవాలయాలకు, చేపల చెరువులకు నష్టపరిహా రం అందించవలసి ఉందని చెబుతున్నారు.
వాహనాలను చూపి బిల్లులు..
2022 బడ్జెట్‌లో ఆఫ్‌షోర్‌కు రూ.885 కోట్లు కేటాయించారు. గతంలో పనులు చేసిన కాం ట్రాక్టర్‌ను తప్పించి.... శ్రీసాయిలక్ష్మీ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి జీవో నెంబర్ 365 ప్రకారం పనులు అప్పగించారు. అంచనాలు సవరించి... రూ. 466.28 కోట్లతో పనులు చేస్తున్నట్టు చెబుతు న్నారు. కానీ ఎక్కడా పనులు జరుగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. పనులు చేపట్ట వలసిన ప్రదేశాలలో పాత లారీలు.. ఎక్స్‌కవే టర్లు నిలబెట్టి.. బిల్లులు చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలో ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో నిర్వాసితుల నిరీక్షణ ఎంతవరకు ఫలిస్తుందో... పనులు ఏ మేరకు ముందుకు కదులుతాయో చూడాలి.
నివేదికను కలెక్టర్ పంపాం..
ఆఫ్‌షోర్ నిర్వాసితుల నుంచి వచ్చిన దరఖాస్తుల మేరకు సర్వే చేసి సంబంధిత జాబితాను జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
-వైకుంఠరావు, ఆర్‌ఐ
Updated Date - Jan 18 , 2024 | 12:25 AM